Shamita Shetty Break Up: ఏడాదిలోనే బ్రేకప్ చెప్పేసిన హీరోయిన్.. మూన్నాళ్ల ముచ్చటే అయిందిగా!
Shamita Shetty break-up with Raqesh Bapat. రియాల్టీ షో బిగ్‌బాస్ వేదికగా పరిచయమైన సెలబ్రిటీ జోడీ షమితా శెట్టి, రాకేశ్ బాపత్ విడిపోయారు.
Shamita Shetty break-up with Raqesh Bapat: గత కొంతకాలంగా సినీ సెలెబ్రెటీలు తన వివాహ బంధంకు ముగింపు పలకడం లేదా ప్రేమకు పులిస్టాప్ పెట్టడం సర్వసాధారణం అయింది. ముఖ్యంగా బాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమిర్ ఖాన్-కిరణ్ రావ్, హృతిక్ రోషన్-సుహానే ఖాన్, అర్భాజ్ ఖాన్-మలైకా అరోరా తమ వివాహ బంధంకు గుడ్ బై చెప్పగా.. సుస్మితా సేన్-రోహ్మాన్ షాల్ తన ప్రేమకు స్వస్తి చెప్పారు. ఈ బాటలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ చెల్లులు, నటి షమితా శెట్టి కూడా చేరిపోయాయారు.
రియాల్టీ షో బిగ్‌బాస్ వేదికగా పరిచయమైన సెలబ్రిటీ జోడీ షమితా శెట్టి, రాకేశ్ బాపత్ విడిపోయారు. ఈ జోడి పరిచయమైన ఏడాదిలోనే తమ ప్రేమ బంధానికి స్వస్తి పలకడం విశేషం. తమ దారులు వేరని, అందుకే తాము విడిపోతున్నాం అని షమితా శెట్టి మంగళవారం ప్రకటించించారు. 'మా బంధంపై స్పష్టత ఇస్తున్నా. రాకేశ్ బాపత్, నేనూ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం కలిసి లేము. ఇంతకాలం మీరు మాపై చూపించిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. ఇకనుంచి కూడా ఇదే విధంగా చూపిస్తారనుకుంటున్నా' అని షమితా శెట్టి పేర్కొన్నారు.
బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి సోదరిగా షమితా శెట్టి ఇండస్ట్రీలోకి వచ్చారు. చాలా సినిమాలే చేసినా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. చేతిలో అవకాశాలు లేకపోవడంతో గతేడాది బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొన్నారు. ఆ షోల నటుడు రాకేశ్ బాపత్‌తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకే వీరు ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు అని అందరూ భావించారు. ఇంతలోనే తాము పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామంటూ ప్రకటించారు. పిలిస్తే పలుకుతా సినిమాతో షమితా శెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
Also Read: MS Dhoni: టైమ్ లేదంటూ.. రోహిత్ శర్మ కాల్ కట్ చేసిన ఎంఎస్ ధోనీ (వీడియో)!
Also Read: Vastu tips: పసుపు, ఉప్పు ఎందుకు అప్పుగా ఇవ్వకూడదు? కారణం తెలుసుకోండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook