Shocking case against Prabhu: ఒకప్పటి తమిళ స్టార్ హీరో, దివంగత శివాజీ గణేషన్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి. 1952 లో సినీ రంగ ప్రవేశం చేసిన శివాజీ గణేషన్ ఆ తర్వాత నటుడిగా నిర్మాతగా తమిళ సినిమాకు ఎంతో సేవ చేశారు. ఆయనకు నలుగురు సంతానం కాగా వారిలో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. శివాజీ గణేషన్ కుమారులలో ప్రభు నటుడిగా కొన్ని సినిమాలు చేశారు కాబట్టి ఆయన అందరికీ సుపరిచితమే. మరో కుమారుడు పేరు రామ్ కుమార్ కూడా నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇద్దరు కుమార్తెల పేర్లు శాంతి నారాయణ స్వామి, రాజ్వీ గోవిందరాజన్. ఇప్పుడు తాజాగా శాంతి, రాజ్వీ కలిసి కోర్టును ఆశ్రయించారు. శివాజీ గణేషన్ మరణం తర్వాత ఆయన సంపాదించిన 270 కోట్ల రూపాయల ఆస్తి పంపకం సరిగా జరగలేదని వారు భావిస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ప్రభు, రామ్ కుమార్ లు తమకు తెలియకుండా కొన్ని ఆస్తులు విక్రయించారని శాంతి నారాయణ స్వామి, రాజ్వీ గోవిందరాజన్ ఆరోపిస్తున్నారు,


సుమారు 1000 సవర్ల బంగారం 500 కేజీల వెండి సహా శాంతి థియేటర్స్ మాత్రమే కాక మరో 82 కోట్ల రూపాయల ఆస్తి తమ సోదరులు తమ పేరిట మార్చి రాసుకున్నారని కోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి రాసినట్లు ఉన్న వీలునామా నకిలీదని వారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పేరిట తమ దగ్గర సంతకం తీసుకుని తనను మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభు కుమారుడు హీరో విక్రమ్, ప్రభు మరో కుమారుడు దుష్యంత్ పేర్లు కూడా ఈ కేసులో చేర్చడం సంచలనంగా మారింది. ఈ విషయం మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. తమ సోదరులు అమ్మిన ఆస్తుల అమ్మకం ప్రక్రియ చెల్లదని ప్రకటించాలని శివాజీ గణేషన్ కుమార్తెలు కోరుతున్నారు.
Also Read: Major Closing Collections: అడవి శేష్ మేజర్ మూవీ ఎన్ని కోట్లు లాభం సాధించిందో తెలుసా?


Also Read: Godfather Poster: 'గాడ్‌ ఫాదర్' నుంచి మరో పోస్టర్.. రియల్ గ్యాంగ్‌స్టర్ వచ్చేశాడు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook