న్యూఢిల్లీ: COVID-19 లాక్డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు నటుడు సోనూసూద్ అందించిన మానవీయ సహాయాన్ని అభినందిస్తూ గువహతికి చెందిన స్పీడ్ పెయింటర్ రణబీర్ బార్ సోనుసూద్ చిత్రాన్ని వేశారు. అస్సాం కార్మికుల కోసం, బరాక్ లోయ నుండి 180 మంది వలసదారులను ఇంటికి తిరిగి పంపించడానికి చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: దేశంలో 8వేలు దాటిన కరోనా మరణాలు


రణబీర్ వేసిన చిత్రానికి సోనుసూద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అద్భుతమైన కళాకారుడిని వ్యక్తిగతంగా కలవాలనుకుంటున్నానని ట్విట్టర్లో పేర్కొన్నాడు. లాక్డౌన్ కారణంగా వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన దేశంలోని వలస కార్మికుల కోసం సోనూసూద్ చేసిన సహకారాన్ని ఈ చిత్రంలో రణబీర్ చూయించాడు. 


Also Read: ఏపీలో 182 కరోనా కేసులు.. తాజాగా ఇద్దరు మృతి


రణబీర్ తన ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ ఇలాంటి ఇలాంటి విపత్కర సమయంలో నిస్వార్థంగా సహాయం చేస్తున్న నిజమైన హీరోని కలవడం ఆనందంగా ఉందంటూ మీరు చేసిన సేవను నేను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నానని, నేను నా కళ ద్వారా వ్యక్తీకరించడానికి ప్రయత్నించానన్నారు. సోనుసూద్ వలస కార్మికులకు లాక్డౌన్ సమయంలో పేదవారికి ఆహారం అందించడం, వైద్యులకు తగు సహకారాలందించడం ఇలా పలు రకాలుగా సహాయం కోరే వారికి హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించాడు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..