సోనూసూద్ పై అభిమానుల ఆసక్తికర ట్వీట్లు..
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కష్టకాలంలో వలసకార్మికులకు సహకారాన్నందిస్తున బాలీవుడ్ నటుడు సోనుసూద్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంశలందుకుంటున్నాడు. కరోనా మహమ్మారి విజృంభణ అధికంగా ఉన్న మహారాష్ట్రలో
ముంబై: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కష్టకాలంలో వలసకార్మికులకు సహకారాన్నందిస్తున బాలీవుడ్ నటుడు (Sonusood) సోనుసూద్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంశలందుకుంటున్నాడు. కరోనా మహమ్మారి విజృంభణ అధికంగా ఉన్న మహారాష్ట్రలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు అండగా నిలుస్తున్నాడు. వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా వారి స్వగ్రామాలకు పంపుతున్నాడు.
Also Read: కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ మృతి
సోనుసూద్ ఇటీవల నిసార్గా తుఫాను ముంబై తీరానికి చేరుకున్నప్పుడు చాలామంది (Maharastra) మహారాష్ట్ర వాసులు మళ్లీ ఆందోళన చెందారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ విషయంలో తమ ఆందోళనను పంచుకున్నారు. (Covid-19) కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో, సంక్షోభం సమయంలో లక్షలాది మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన విధంగానే సోనూసూద్ మరో విపత్తును ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందని (Nisarga Cyclone) నిసార్గా తుఫాను బారినుండి తమను కాపాడుతాడని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోగలడని తన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here