కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ మృతి

దేశంలో కరోనా మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ ప్రముఖ సంగీత దర్శకుడిని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ (Wajid Khan Death) ఆకస్మిక మరణంపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Updated: Jun 1, 2020, 11:32 AM IST
కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ మృతి

ప్రాణాంతక కరోనా మహమ్మారి మరో సినీ ప్రమఖుడిని మింగేసింది. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్(42). కిడ్నీ సంబంధిత సమస్యతో సతమతమవుతున్న ఆయనకు కొన్ని రోజుల కిందట కరోనా లక్షణాలు కనిపించాయి. గుండె సంబంధిత సమస్యలతోనూ చికిత్స పొందుతున్న వాజిద్ ఖాన్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ పిన్న వయసులోనే చనినపోవడంపై బాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.  జూన్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే.. 

వాజిద్ ఖాన్ మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, వరుణ్ ధావన్, శంకర్ మహదేవన్ తదితరులు సంతాపం ప్రకటిస్తున్నారు, వాజిద్ ఖాన్ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాస్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బాలీవుడ్ సంగీత ద్వయం సాజిద్ - వాజిద్‌లలో ఒకరే ఈ సాజిద్ ఖాన్.    LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్

సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా పలు హిట్ సినిమాలకు పనిచేసిన వాజిద్ ఆకస్మిక మరణంతో బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ సినిమాలు వాంటెడ్, దబాంగ్, ఏక్తా టైగర్ సినిమాలకు, రౌడీ రాథోడ్, హీరోపంటి, పార్ట్‌నర్ లాంటి హిట్ సినిమాలకు సాజిద్ - వాజిద్ జోడీనే స్వరాలు సమకూర్చిందిక్వారంటైన్‌పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ క్లారిటీ

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి