గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ( SP Balasubrahmanyam health condition ) మరింత క్షీణించిందనే వార్తల నేపథ్యంలో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. మరోవైపు చెన్నైలో ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తాజాగా బాలు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ ( SPB health bulletin ) విడుదల చేశాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డా అనురాధ భాస్కరన్ తెలిపారు. గత 24 గంటలుగా బాలు ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఎక్మో, వెంటిలేటర్ సహాయంతోనే బాలుకు చికిత్స అందిస్తున్నామని డా అనురాధ ఆ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. Also read : SPB health condition: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరోసారి తీవ్ర అస్వస్థత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"193781","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SP-Balasubrahmanyam-health-condition-health-bulletin","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SP-Balasubrahmanyam-health-condition-health-bulletin","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"SP-Balasubrahmanyam-health-condition-health-bulletin","style":"float: left;","class":"media-element file-default","data-delta":"1"}}]]


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


ఎంజీఎం ఆస్పత్రి వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు స్పష్టంచేశాయి. కరోనావైరస్ ( Coronavirus ) సోకిన అనంతరం ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే బాలు కరోనా నుంచి కోలుకుంటున్నట్టు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ( SP Charan ) మీడియాకు తెలిపారు. కానీ ఇంతలోనే మళ్లీ ఇలా జరగడం బాలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. Also read :  SP Balasubrahmanyam Health condition: అది ఫేక్ న్యూస్.. నమ్మొద్దు: ఎస్పీ చరణ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe