Sravana Bhargavi: వెంకన్న కీర్తనతో వివాదంలో శ్రావణ భార్గవి.. షాకింగ్ సమాధానం
Sravana Bhargavi landed in trouble: శ్రావణ భార్గవి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ఒక కీర్తనను తన అందాన్ని వర్ణించడం కోసం వాడుకున్నదని అన్నమాచార్యుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Sravana Bhargavi landed in trouble: కొద్దిరోజుల క్రితం వరకు హేమచంద్రతో విడాకులు తీసుకోబోతోంది అంటూ అనూహ్యంగా వార్తల్లోకి వచ్చిన శ్రావణ భార్గవి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. అదేమిటంటే తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ఒక కీర్తనను తన అందాన్ని వర్ణించడం కోసం వాడుకున్నదని అన్నమాచార్యుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీవారి అభిషేకం సమయంలో ఆయనను కీర్తించేందుకు అన్నమాచార్య రాసిన ఒక కీర్తన 'ఒకపరి వయ్యారమే' అనేదాన్ని శ్రావణ భార్గవి తనదైన శైలిలో పాడి ఆ పాటలో చీరకట్టుతో తనను అందంగా చిత్రీకరించుకొని ఒక వీడియోను తన యూ ట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.
అది పోస్ట్ చేసి రెండు రోజులు అవుతుండగా సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అది అన్నమయ్య కుటుంబ సభ్యుల వరకు వెళ్లడంతో వారు ఆమె వ్యవహారం మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు స్వామివారికి అభిషేకం చేస్తూ కీర్తించిన అలాంటి పాటను ఆమెకు కాళ్లు ఊపుతూ తన అందాన్ని వివిధ భంగిమల్లో చిత్రీకరిస్తూ చూపించడం తప్పని అన్నమాచార్య వంశస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మీద స్పందించాల్సిందిగా ఆమెను కోరినా సరే ఫలితం లేదని ఆమె చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుందని వారు చెబుతున్నారు.
తమతో పాటు అనేకమంది ఆ పాటను తొలగించాల్సిందిగా కోరితే ఆమె యూట్యూబ్లో కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసిందని చెప్పుకొచ్చారు అయితే ఈ కీర్తనను తన హస్కీ వాయిస్ తో పాడిన శ్రావణ భార్గవి తన అందాన్ని వర్ణించడం కోసమే ఈ వీడియో చేసిందా అనిపించే విధంగా ఉంది. ఇది కరెక్ట్ కాదని ఆమెను ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నిస్తే అన్నమాచార్య సంకీర్తనలు చాలా మంది వాడుకున్నారు ఇది శృంగార సంకీర్తన కాబట్టి నేను వాడుకుంటే తప్పేమిటి అనే విధంగా ఆమె స్పందించినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఏమైనా కల్పించుకుని చర్యలు తీసుకుంటుందేమో చూడాల్సి ఉంది.
Also Read: Nithya Menon Marriage: పెళ్లికి సిద్దమైన నిత్యామీనన్.. ఆ హీరోతోనేనేనా!
Also Read: Koffee With Karan: సమంతను ఎత్తుకొచ్చిన అక్షయ్.. మాములు రచ్చ కాదుగా ఇది!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook