ఉద్యోగం కావాలంటే..బయోడేటా పంపిస్తారు. వీలైతే రెజ్యూమ్ పంపిస్తారు. ఇది సర్వసాధారణం. కానీ అగ్రరాజ్యం అమెరికాలో ఓ విద్యార్థి .. అమ్మాయిని ప్రేమించడానికి రెజ్యూమ్ పంపించాడు. వినడానికి కొత్తగా ఉన్నా .. ఇది నిజం. ఆ అమ్మాయి.. ఆ రెజ్యూమ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. యువత కోసం డేటింగ్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎవరైనా అమ్మాయిని డేటింగ్‌కు పిలవాలంటే డేటింగ్ యాప్స్ సాయంతో ఆహ్వానించవచ్చు. ఐతే అమెరికాలోని కాలిఫోర్నియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థి కొత్త పంథాను ఎంచుకున్నాడు. శాన్ డియాగో యూనివర్శిటీలో చదువుతున్న జేమ్స్. . అదే యూనివర్శిటీకి చెందిన క్రిష్టిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్ పూర్తి కాబోతోంది. దీంతో హైరానా పడ్డ యువకుడు .. ఆమెను డేటింగ్‌కు ఆహ్వానించాలని ధైర్యం చేశాడు. ఓసారి తన కోరికని ఆమెకు వెలిబుచ్చాడు. ఐతే ఆ అమ్మాయి ఫన్నీగా అతనికి ఓ విషయం చెప్పింది. నిజంగా నన్ను డేటింగ్‌కు ఆహ్వానించాలనుకుంటే . . ఓ కవర్ లెటర్ పంపించమని కోరింది. దీనికి జేమ్స్ ఏకంగా తన రెజ్యూమ్‌నే ఆ అమ్మాయికి పంపించాడు. రెజ్యూమ్‌లో తన హైట్, వెయిట్, చదువుతోపాటు , పాత గర్ల్ ఫ్రెండ్స్ వివరాలు కూడా పొందు పరిచాడు.



Read Also: ఆలోపే రజినీకాంత్ చచ్చిపోతాడు..!!


జేమ్స్ పంపిన రెజ్యూమ్‌ను చూసి నవ్వుకున్న క్రిస్టినా.. దాన్ని యథాతథంగా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీన్ని ఒక వెరైటీగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..