Sudigali Sudheer Remuneration : సుడిగాలి సుధీర్ ఎట్టకేలకు మాస్ హిట్ కొట్టేశాడు. మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని సుధీర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బుల్లితెరపై స్టార్‌గా తన సత్తా చాటుతూ వచ్చిన సుధీర్‌కు చివరకు ఓ మంచి మాస్ మసాలా సినిమా పడింది. కథ, కథనాలను కూడా జనాలు అంతగా పట్టించుకోనట్టు కనిపిస్తోంది. గాలోడు సినిమాను బీ, సీ సెంటర్లలో ఆడియెన్స్ తెగ చూసేస్తున్నారు. మసూద, గాలోడు రెండు చిత్రాలు కూడా బ్రేక్ ఈవెన్ అయ్యాయి. గాలోడు మాస్ ప్రేక్షకులకు విపరీతంగా ఎక్కేసినట్టుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తంగా నేటి వరకు గాలోడు సినిమాకు ఆరు కోట్ల గ్రాస్, మూడు కోట్ల షేర్ వచ్చినట్టు సమాచారం. ఇకపై వచ్చేవన్నీ కూడా లాభాలే అని తెలుస్తోంది. గాలోడు సినిమా మొత్తానికి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అని అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు గాలోడు సినిమాకు సుధీర్ ఎంత తీసుకుని ఉంటాడనే చర్చ మొదలైంది. అయితే ఈ విషయం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.


గాలోడు సినిమాకు సుధీర్ యాభై లక్షలు తీసుకున్నాడని కొందరు అంటున్నారు. ఇంకొందరు అయితే యాభై నుంచి కోటి మధ్యలో తీసుకుని ఉంటాడని అంటున్నారు. ఇలా ఏది ఏమైనా ఎంత తీసుకున్నా కూడా సుధీర్ మార్కెట్ రేంజ్ ఏంటన్నది అందరికీ అర్థమైంది. సరైన సినిమా పడితే.. మాస్ సినిమా సత్తా ఏంటి, సుధీర్ అభిమానుల సత్తా ఏంటి? సుధీర్ క్రేజ్ ఏంటి? అన్నది అందరికీ చూపించేశారు.


ఇప్పుడు సుధీర్‌ తన గాలోడు సినిమాతో మంచి ఫాంలోకి వచ్చాడు. ఇకపై సుధీర్ తన ఫోకస్ కూడా సినిమాల మీద పెట్టనున్నట్టు అనిపిస్తోంది. ఆల్రెడీ గజ్జల గుర్రం అనే సినిమా లైన్లో ఉంది. ఇందులో రష్మీ, సుధీర్ కలిసి నటించనున్నట్టు తెలుస్తోంది.

Also Read : HIT 2 Trailer : HIT 2 కచ్చితంగా హిట్టే.. వేరే లెవెల్‌లో ట్రైలర్‌


Also Read : Krishna indira devi Marriage : సూపర్ స్టార్ కృష్ణ-ఇందిరా దేవీ పెళ్లి రోజు.. మహేష్‌ సోదరి మంజుల ఎమోషనల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook