HIT 2 Trailer : HIT 2 కచ్చితంగా హిట్టే.. వేరే లెవెల్‌లో ట్రైలర్‌

HIT 2 Trailer out అడివి శేష్, నాని, శైలేష్ కొలను మరోసారి హిట్ కొట్టబోతోన్నారు. హిట్ సినిమాతో విశ్వక్ సేన్‌కు మంచి హిట్ వచ్చింది. ఇప్పుడు HIT 2 సినిమాతో అడివి శేష్‌ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడేట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2022, 11:53 AM IST
  • HIT 2 ట్రైలర్ విడుదల
  • అదరగొట్టేసిన అడివి శేష్
  • మరోసారి హిట్ కొట్టబోతోన్న నాని
HIT 2 Trailer : HIT 2 కచ్చితంగా హిట్టే.. వేరే లెవెల్‌లో ట్రైలర్‌

Adivi sesh HIT 2 Trailer : నాని నిర్మాతగా శైలేష్‌ కొలను దర్శకుడిగా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన HIT సినిమా ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ ఫ్రాంచైజీలో రాబోతోన్న HIT 2 సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. అడివి శేష్‌ హీరోగా చేస్తోండటంతో సినిమా మీద అంచనాలు ఆల్రెడీ పెరిగాయి. టీజర్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. భయంకరమైన దృశ్యాలుండటంతో యూట్యూబ్ నుంచి టీజర్‌ను తీసేశారు. ఏజ్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇక ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసి అందరూ ఆశ్చర్యపోతోన్నారు.

 

ముందు ఒక అమ్మాయిని మాత్రమే హత్య చేశారని అనుకుంటారు. కానీ ఆ బాడీలో తల ఒకరిది.. చేతులు, కాళ్లు ఇలా అన్నీ ఒక్కొక్క అమ్మాయిది అని ట్రైలర్ చివర్లో అర్థమవుతోంది. ఇలాంటి హత్యలు చేసేవారిది కోడి బుర్ర అని ఇట్టే పట్టేసుకుంటాను అని పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్న అడివి శేష్‌ అంటాడు. కానీ ఆ హంతకుడిని మాత్రం పట్టుకోలేకపోతారు. మరి ఈ ట్రైలర్‌లో అయితే ఆ హంతకుడిని చూపించలేదు. సినిమాలో హంతకుడిని ఎలా పట్టుకుంటాడు.. అతను ఎవరు? ఎందుకు ఇవన్నీ చేసి ఉంటాడు అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ప్రామిసింగ్‌గానే అనిపిస్తోంది. పన్ను మీద పన్ను ఉండే ఆ హంతకుడిని ఎలా కనిపెడతారు? అసలు సిటీలో అమ్మాయిలను అంత క్రూరంగా ఎవరు చంపేస్తున్నారు? ఎందుకు చంపుతున్నారు? పోలీసు ఉన్నతాధికారి ఎందుకు అంత లైట్‌ తీసుకున్నాడు? ఈ కేసును అడివి శేష్ ఎలా పరిష్కరించాడు? అనేది మాత్రం జనాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్‌ మరింత ఎక్కువగా హిట్ అయ్యేలా ఉంది. మొత్తానికి టైటిల్‌కు తగ్గట్టే సినిమాలు హిట్ అయ్యేట్టు కనిపిస్తున్నాయి. మూడో పార్ట్ కోసం నాని, విజయ్ సేతుపతి, అడివి శేష్ వంటి వారు కలిసి పని చేస్తారని టాక్.
Also Read : Samantha HBD Naga Chaitanya : నాగ చైతన్య బర్త్ డే.. సమంత పోస్టులు వైరల్.. అంత ప్రేమ ఎక్కడికిపోయింది?  

Also Read : Jabardasth Varsha : వర్షించే అందం అంటే ఇదేనా?.. జబర్దస్త్ వర్ష వింత జాకెట్.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x