హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ట్విట్టర్ ఇండియాకు లేఖ రాశారు. సుశాంత్ డిలీట్ చేసిన ట్వీట్స్ వివరాలను తెలుసుకునేందుకు ఈ లేఖ రాశారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన కొద్ది రోజుల ముందు ట్విట్టర్‌లో కొన్ని ట్వీట్స్ చేసి డిలీట్ చేశాడని మీడియాలో ప్రచారం జరగడంతో ఈ అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. కాగా డిలీట్ చేసిన ట్వీట్స్‌లో సుశాంత్ కొన్ని స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేశాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఈ కోణంలోనూ ముంబై పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. కూరగాయలమ్ముతున్న నటుడు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sushant Singh Rajput: సుశాంత్ గురించి గాళ్‌ఫ్రెండ్, నటి షాకింగ్ విషయాలు


అయితే ప్రస్తుతం డిసెంబర్ 27, 2019న సుశాంత్ చేసిన పోస్ట్ అతని ట్విట్టర్ అకౌంట్‌లో చివరగా పోస్ట్ చేసినట్లు చూపిస్తోంది. సుశాంత్ మృతిని ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు ఆత్మహత్యకు కారణాన్ని కనుగొనేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పోస్ట్‌మార్టం తుది నివేదికలో కూడా సుశాంత్ గొంతు బిగుసుకుని ఊపిరాడక మరణించాడని తేలిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణ సుశాంత్‌కు అత్యంత సన్నిహితులైన కొందరు స్నేహితులు సంచలన విషయాన్ని బయటపెట్టారు. కొందరు వ్యక్తులు పనిగట్టుకుని కక్ష్యపూరితంగా తన ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తున్నారని, కొన్ని న్యూస్ పేపర్స్, వెబ్‌సైట్స్‌లో విమర్శనాత్మకంగా వార్తలు, కథనాలు రాయిస్తున్నారని సుశాంత్ తమకు చెప్పుకుని బాధపడ్డాడని, సుశాంత్ మానసిక ఒత్తిడికి లోనవడానికి ఇదొక కారణమని అతని స్నేహితులు పోలీసులకు వెల్లడించారు. 
 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ