3 Lakhs Discounts on SUVs in March 2023:  2022-23 ఆర్థిక సంవత్సరం ఈ మార్చితో ముగియనుంది. 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్డీఈ (RDE) నిబంధనలు కార్లకు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ కార్ల స్టాక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దాంతో కస్టమర్లకు ఓ విధంగా 'మార్చి బొనాంజా' అని చెప్పొచ్చు. కొత్త ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి కస్టమర్లకు ఇది గొప్ప అవకాశం. ఈ నెలలో పలు ఎస్‌యూవీలు 3 లక్షల రూపాయల వరకు తగ్గింపును కలిగి ఉన్నాయి. మీరు కూడా కొత్త ఎస్‌యూవీ కొనాలనుకుంటే.. మార్చిలో కొనేసుకోండి. ఈ నెలలో అత్యంత తగ్గింపు కలిగిన కార్ల జాబితాను ఓసారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Citroen C5 Aircross:
సిట్రోయెన్ ఇటీవలే సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ యొక్క కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. దాంతో పాత మోడల్ యూనిట్ల కొనుగోలుపై రూ. 3 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. C5 ఎయిర్‌క్రాస్ మంచి ఎస్‌యూవీ. ఈ ఎస్‌యూవీ యొక్క ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 37.17 లక్షలుగా ఉంది.


Jeep Meridian:
జీప్ మెరిడియన్ ఒక అమెరికన్ ఎస్‌యూవీ. ఈ కారు పలు వేరియంట్‌లపై రూ. 2.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నారు. జీప్ మెరిడియన్ భారతీయ మార్కెట్లో మహీంద్రా స్కార్పియన్ పైన మరియు టయోటా ఫార్చ్యూనర్ క్రింద ఉంది. జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ ధరలు రూ. 30.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.


Volkswagen Tiguan: 
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ భారతీయ మార్కెట్లో జీప్ మెరిడియన్ మరియు స్కోడా కొడియాక్‌లతో పోటీపడుతోంది. ఈ ఎస్‌యూవీపై కంపెనీ రూ.1.85 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ యొక్క ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 33.49 లక్షలు.


Jeep Compass:
ఏప్రిల్ 2023లోపు జీప్ కంపాస్ ఎస్‌యూవీ కొనుగోలుపై రూ. 1.5 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని జీప్ కంపెనీ అందిస్తోంది. జీప్ కంపాస్ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.20.99 లక్షలు. శక్తివంతమైన ఎస్‌యూవీ కార్లలో ఇది ఒకటి.


MG Astor:
అడాస్ ఫీచర్‌తో వస్తున్న చౌకైన కార్లలో ఎంజీ ఆస్టర్ ఒకటి. మార్చి నెలలో ఈ ఎస్‌యూవీ కొనుగోలుపై కంపెనీ రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఎంజీ ఆస్టర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.51 లక్షలుగా ఉంది.


Also Read: Best 5G Phone Under 15k: అతితక్కువ ధరకే శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు అదుర్స్! ఏకంగా 6000 బ్యాటరీ


Also Read: Virat Kohli Test Century: హోటల్ బాయ్ నుంచి బస్ డ్రైవర్ వరకు దాని గురించే అడిగేవారు.. విసుగెత్తిపోయా: విరాట్ కోహ్లీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి