Virat Kohli Gives Answer To Rahul Dravid Question On Test Century: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. మూడు సంవత్సరాలకు పైగా నిరీక్షణకు తెరదించుతూ సుదీర్ఘ ఫార్మాట్‌లో భారీ సెంచరీ చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో కోహ్లీ (186) సూపర్ శతకం బాదాడు. కోహ్లీ విరోచిత బ్యాటింగ్‌తో నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. అంతేకాదు టీమిండియా 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి కోహ్లీ మాట్లాడాడు. ఈ సందర్భంగా తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'అహ్మదాబాద్ టెస్టుకు ముందు కూడా నేను బాగా ఆడాను. మంచి పరుగులు చేస్తూ.. ఫామ్‌లోనే ఉన్నాను. ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఆస్ట్రేలియా ఈ పిచ్‌ను అద్భుతంగా వాడుకుంది. మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మంచి ఫీల్డ్‌తో మాపై ఆసీస్ ఒత్తిడి తెచ్చింది. నేను చాలా ఓపికగా ఆడుతూ నా డిఫెన్స్ ఆడాను. టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు నేను ఇదే టెంప్లెట్ ఉపయోగిస్తా. నా డిఫెన్సే నాకు అతిపెద్ద బలం. ఈ పిచ్‌పై బౌండరీలు అంత సులువుగా రాలేదు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ సెంచరీ పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది' అని అన్నాడు.
'ఎప్పుడూ ఒకే మైండ్‌సెట్‌తో ఆడటం ఏమాత్రం మంచిది కాదు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాలి. అన్ని ఫార్మాట్లలో నేను రాణించడానికి ప్రధాన కారణం ఇదే. పరిస్థితులకు తగ్గట్లు ఆడేందుకు నేను మానసికంగా సిద్దమవుతా. ఈ వికెట్‌పై నేను ఒకే ఓవర్లో 6 డబుల్స్ కూడా తీయగలను. ఈ కారణం చేతనే నేను విభిన్న పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయగలను. జట్టు కోసం ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడం, పరుగులు చేయడం నా ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే సెంచరీలు వస్తుంటాయి' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
'రికార్డులు, మైలురాళ్ల కోసం నేను ఎప్పుడూ ఆడను. రికార్డుల గురించి అసలు పట్టించుకోను. అయితే సెంచరీకే ప్రాధాన్యత లభిస్తోంది. హోటల్ బాయ్ నుంచి బస్ డ్రైవర్ వరకు.. ప్రతీ ఒక్కరూ సెంచరీ గురించే అడిగారు. వినివిని విసుగెత్తిపోయా. చివరకు సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. అయితే ఓ సెషన్‌లో 30 పరుగులు చేసినా సంతోషిస్తా. అదేవిధంగా బౌండరీలు కొట్టలేదని ఏ మాత్రం నిరాశకు గురవ్వను. 5-6 సెషన్ల పాటు బ్యాటింగ్ చేయడం నాకు ఇష్టం. అప్పుడే మానసికంగా, శారీరకంగా ఎంత దృడంగా ఉన్నామో తెలుస్తోంది. కఠిన పరిస్థితుల్లో జట్టు కోసం ఆడటాన్ని ఎప్పుడూ ఇష్టపడతా' అని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
Also Read: Virat Kohli Records: ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. క్రికెట్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.