తెదేపా ఎంపీలను జోకర్లుగా అభివర్ణించిన వర్మ
రాంగోపాల్‌వర్మ రూటు మారింది; ఈసారి టీడీపీ వైపు ..
దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఈసారి రూటు మార్చాడు. తెదేపా ఎంపీలను లక్ష్యం చేసుకున్నాడు. వివిధ అంశాలపై తనదైన శైలిలో సెటైర్లు వేసే వర్మ .. ఏపీ కోసం పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్న టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించాడు.
ఫేస్‌బుక్‌లో టీడీపీ ఎంపీల ఫోటో ఒకటి పెట్టి, రెండు పోస్టులు చేశాడు వర్మ. తొలి పోస్టులో ‘ఇలాంటి జోకర్లు ఏపీ ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నిక కావటం చూస్తున్న నరేంద్ర మోదీ బహుశా ఏపీని ఓ జోక్‌గా భావిస్తున్నాడేమో. వీరు జోకర్లకు తక్కువ’ అంటూ ఎద్దేవా చేశాడు. మరో పోస్టులో ‘టీడీపీ చెందిన వీళ్లు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలుగు దేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురి చేస్తున్నారు' అంటూ పోస్టు చేశాడు.