కోహ్లీ - అనుష్కల రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన భార్య అనుష్క శర్మ సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతీ వారం ఈ జంట ఎక్కడో ఒకచోట కలుసుకుంటూనే ఉంటున్నారు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన భార్య అనుష్క శర్మ సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతీ వారం ఈ జంట ఎక్కడో ఒకచోట కలుసుకుంటూనే ఉంటున్నారు. అంతే కాకుండా హాయిగా ఫోటోలు దిగి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అవి బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలను కూడా వారు చాలా వైవిధ్యమైన రీతిలో తీసుకోవడం గమనార్హం.
గతేడాది డిసెంబర్ 11వ తేదిన విరాట్, అనుష్కను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఈ జంటకు ఫాలోవర్లు బాగానే ఉన్నారు. తొలుత అనుష్కను పెళ్లి చేసుకున్నాక కోహ్లీ ఫామ్ కోల్పోయాడని విమర్శలకు దిగిన ఆయన అభిమానులు.. ఆ తర్వాత అనుష్కకు లక్కీగర్ల్ అని కూడా కితాబివ్వడం గమనార్హం.