హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా సక్సెస్ ఫుల్ గా 4 రోజులు కంప్లీట్ చేసుకుంది. వినాయక చవితి ఫెస్టివల్ కూడా కలిసిరావడంతో ఈ సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయి.  ఇప్పటికీ బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ కు చేరువలో ఉన్న సాహో... తెలుగు రాష్ట్రాల్లో రూ.67 కోట్ల రూపాయల షేర్ సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాహో రికార్డుల పర్వం...


విడుదలైన రోజు నుంచి నిన్నటివరకు వసూళ్ల పరంగా ఎక్కడా తగ్గలేదు సాహో సినిమా. నైజాం, నెల్లూరులో బాహుబలి-2ను బీట్ చేయడంతో పాటు.. మిగతా అన్ని ఏరియాస్ లో నాన్-బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసింది. సాహో దెబ్బకు ఇప్పటివరకు మిగతా హీరోల పేరిట ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.


నైజాంలో బాహుబలి-2 రికార్డు బ్రేక్..
ఇక్కడ నైజాం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విడుదలైన మొదటి రోజే బాహుబలి-2 రికార్డును బద్దలుకొట్టిన సాహో.. ఆ రోజు నుంచి నిన్నటివరకు రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తూ వస్తోంది. ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఇదిలా ఉంటే  ఏపీ, నైజాం 4 రోజుల షేర్ ను ఒక్క సారి పరిశీద్దాం