తెలుగు ట్రైలర్ : థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ తెలుగు ట్రైలర్ వచ్చేసిందోచ్
థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ తెలుగు ట్రైలర్
ఆమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తొలిసారి కలిసి నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాను ఆ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేయనుంది. అందులో భాగంగానే నిన్న అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ వేర్వేరుగా కనిపించిన ఓ ప్రోమో వీడియో విడుదల చేసిన నిర్మాతలు తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మూవీ అభిమానులకు దీపావళి కానుకగా నవంబర్ 8న థియేటర్లలోకి రానుంది.
విజయ్ క్రిష్ణ ఆచార్య రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మించగా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్స్ ద్వయం అజయ్-అతుల్ మ్యూజిక్ అందించారు.