TikTok: మళ్ళీ పుంజుకున్న టిక్ టాక్ రేటింగ్.. కారణమదేనా?
ఇండియాలో టిక్ టాక్ (TikTok) అతి కాలంలో పెద్ద ఎత్తున పాపులారిటీని సంపాదించిన విషయం తెలిసిందే.. అయితే గత కొంత కాలంగా టిక్ టాక్ రేటింగ్స్ తగ్గిపోయాయని ఇండియాలో నిషేదిస్తున్నారన్న
హైదరాబాద్: ఇండియాలో టిక్ టాక్ (TikTok) అతి కాలంలో పెద్ద ఎత్తున పాపులారిటీని సంపాదించిన విషయం తెలిసిందే.. అయితే గత కొంత కాలంగా టిక్ టాక్ రేటింగ్స్ తగ్గిపోయాయని ఇండియాలో నిషేదిస్తున్నారన్న పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం టిక్ టాక్ రేటింగ్ పూర్తిగా దిగజారిపోవాడానికి రెండు కారణాలు.. ఒకటి కరోనా వైరస్ కాగా, మరొకటి రెచ్చగొట్టే వీడియోల కారణంగా భారత వినియోగదారుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కరోనా మహమ్మారి (China) చైనాలోని వుహాన్ మొదట ఉద్భవించిన నాటి నుండి ఇప్పటివరకు ప్రపంచ దేశాల నుండి ఎన్నో రకాలుగా అపవాదులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ అప్లికేషన్ ను నిషేధించాలని (Social Media) సామాజిక వేదికల ద్వారా పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది.
Also Read: ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 1024 కేసులు నమోదు
ఈ క్రమంలో టిక్ టాక్‌కు మళ్లీ రేటింగ్ పెరిగింది. టిక్ టాక్ యాప్‌పై వచ్చిన 80 లక్షల నెగటివ్ రివ్యూలను (Google) గూగుల్ సంస్థ తొలగించగా, దీంతో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ (Playstore) ప్లేస్టోర్‌లో టిక్ టాక్ 4.4 స్టార్ రేటింగ్‌తో మళ్ళీ పూర్వ పూర్వ వైభవాన్ని సంపాదించుకొంది.
ఇదిలాఉండగా గూగుల్ సంస్థ, టిక్ టాక్‌తో చీకటి ఒప్పందం చేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చేసుకోవడం వల్లే ఈ అప్లికేషన్ కు భారీ (TikTok Rating) రేటింగ్ ఇచ్చిందని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..