TikTok app users : టిక్‌టాక్ యాప్‌ యూజర్స్‌కి షాకింగ్ న్యూస్

టాక్‌టాక్ యాప్ నిర్వాహకులు ఉపయోగిస్తున్న ఫింగర్ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానం భయంకరమైందని.. పరోక్షంగా అది యూజర్లపై నిఘా వేస్తోందని స్టీవ్ హఫ్‌మన్ ఆరోపించాడు. అందుకే తాను అలాంటి యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోనని స్టీవ్ చెప్పుకొచ్చాడు.

Last Updated : Feb 29, 2020, 10:48 AM IST
TikTok app users : టిక్‌టాక్ యాప్‌ యూజర్స్‌కి షాకింగ్ న్యూస్

టిక్‌టాక్ యాప్‌ అంటే తెలియని వాళ్లు.. టిక్ టాక్ యాప్ వీడియో లేని స్మార్ట్ ఫోన్ లేదేమో అంటే ఆశ్చర్యపోనక్కర్లేదనే చందంగా టిక్ టాక్ వీడియోలు ఇటీవల కాలంలో భారీగా వైరల్ అయ్యాయి.. ఇంకా అవుతున్నాయి. అయితే ఈ టిక్ టాప్ యాప్‌తో మాత్రం ప్రమాదం పొంచి ఉంది అంటున్నాడు అమెరికాలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజంగా ఉన్న రెడిట్ సీఈఓ స్టీవ్ హఫ్‌మేన్. ''టిక్ టాక్ యాప్ ఒక స్పైవేర్. ఆ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవడమే మేలు'' అని బహిరంగంగానే స్టేట్‌మెంట్స్ ఇస్తున్నాడు స్టీవ్ హఫ్‌మేన్. ఓవైపు ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో యూజర్స్ కలిగిన సోషల్ మీడియా యాప్‌గా టిక్ టాక్ యాప్ రికార్డులకెక్కుతుండగా... మరోవైపు రెడిట్ సీఈఓ హఫ్‌మేన్ మాత్రం టిక్‌టాక్ యాప్‌పై తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నాడని అతడి మాటలు చూస్తే అర్థమవుతోంది. సిలికాన్‌వ్యాలీకి చెందిన బడాబడా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు పాల్గొన్న సోషల్ 2030 ఈవెంట్ వేదికపై స్టీవ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యయతను సంతరించుకుంది. 

టాక్‌టాక్ యాప్ నిర్వాహకులు ఉపయోగిస్తున్న ఫింగర్ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానం భయంకరమైందని.. పరోక్షంగా అది యూజర్లపై నిఘా వేస్తోందని స్టీవ్ హఫ్‌మన్ ఆరోపించాడు. అందుకే తాను అలాంటి యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోనని స్టీవ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఎవరికైనా అటువంటి స్పైవేర్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవద్దనే చెబుతానని... ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకుని ఉపయోగిస్తున్న వారు కూడా ఆ యాప్‌ని వారి స్మార్ట్ ఫోన్‌లోంచి అన్‌ఇన్‌స్టాల్ చేసుకుంటేనే మంచిదని టిక్ టాక్ యూజర్స్‌కి స్టీవ్ సూచించాడు. 

Read also : Buying TV, fridge, AC : టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ కొంటున్నారా ? అయితే ఇది చదవండి !

ఇదిలావుంటే, అసలు ప్రపంచంలో టిక్ టాక్ యూజర్స్ ఎంత మంది అనే విషయాన్ని పరిశీలిస్తే... ఇటీవల ఆ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2019లో అత్యధిక మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇన్ స్టాల్ చేసుకున్న యాప్స్‌లో టిక్ టాక్ యాప్ రెండో స్థానంలో ఉంది. 500 మిలియన్ యూజర్స్ ఉన్నారని టిక్ టాక్ ప్రకటించింది. భారత్‌లోనైతే అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న సోషల్ మీడియా యాప్స్‌లో టిక్ టాక్ ముందు వరుసలో ఉందట. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News