R Narayana Murthy mother dies Due to health issues: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు, పీపుల్స్‌ స్టార్‌ ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం ఆమె తుది శ్వాస విడిచారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిట్టెమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దాంతో నారాయణ మూర్తి కుటుంబంలో విషాదషాయలు అలుముకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి తల్లి మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. అభిమానులు కూడా నారాయణ మూర్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. రేపు ఉదయం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. రెడ్డి చిట్టెమ్మకు ఏడుగురు సంతానం. వారిలో మూడో కుమారుడు ఆర్‌ నారాయణ మూర్తి. నారాయణ మూర్తి తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా సత్తాచాటారు. 


ఆర్ నారాయణ మూర్తి పీపుల్స్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎంత సక్సెస్ సాధించినా ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. ఆర్టీసీ బస్సులోనే ఇప్పటికీ ప్రయాణం చేస్తారు. సినిమాలే కాక తన ఊర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పెళ్లి చేసుకోకుండా సినిమాలకి, సమాజానికి నారాయణ మూర్తి తన జీవితంను అంకితమిచ్చారు. 



ఆర్ నారాయణ మూర్తి అసలు పేరు రెడ్డి నారాయణ మూర్తి. నారాయణమూర్తి మహారాణి కాలేజిలో చదువుతున్నపుడు ప్రెసిడెంట్‌గా గెలిచి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనేవారు. అప్పుడే ఎంతో చురుకుగా ఉంటూ కమ్యూనిజం భావజాలంతో ముందుకెళ్ళేవారు. సినిమాలపై ఉన్న ఇష్టంతో మద్రాసు వెళ్లి ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇప్పటివరకు 35పైగా సినిమాలో నటించి పీపుల్ స్టార్‌గా  గుర్తింపు తెచ్చుకున్నారు. దండోరా, లాల్ సలాం, ఎర్ర సైన్యం, ఉరుమనాదిరా, చీమలదండు లాంటి కమ్యూనిజం సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. 
 


Also Read: Nayanathara - vignesh shivan: చెన్నైలోని పోష్ ఏరియాలో రెండు బంగ్లాలు కొన్న నయనతార..


Also Read: Teegala VS Sabitha: టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. మంత్రి సబితపై తీగల డైరెక్ట్ అటాక్.. కాంగ్రెస్ లోకి జంప్?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook