Anushka Shetty Suffering with Rare Disease: టాలీవుడ్ భామ అనుష్క శెట్టి ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. సూపర్ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఆమెను పూరి జగన్నాథ్ పరిచయం చేస్తే తరువాత తనదైన నటనతో ఆమె తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా దూసుకుపోయింది. అయితే బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆమె కెరీర్ ఊపందుకుంటుంది అని అందరూ అనుకుంటే అందుకు భిన్నంగా ఆమె మాత్రం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా ఆ తర్వాత ఆమె చేసిన భాగమతి అనే సినిమా సూపర్ హిట్ అవ్వగా తర్వాత చేసిన నిశ్శబ్దం సినిమా మాత్రం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ నిశ్శబ్దం సినిమా తర్వాత ఆమె సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చేసింది. ఈ మధ్యనే ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే లేదు. మహేష్ అనే కుర్ర దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య షూటింగ్ సెట్స్ లో ఉన్న ఒక ఫోటోని కూడా అనుష్క షేర్ చేసింది.  ఇక ఆమె రాక కోసం ఆమె అభిమానులందరూ ఎంతో ఎదురుచూస్తున్న సమయంలో ఆమెకు ఒక అరుదైన జబ్బు ఉందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పలు వెబ్ సైట్స్ లో ఆమెకు జబ్బు ఉందనే వార్త తెర మీదకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఆమెకు ఉన్నది నిజమైన జబ్బు కాద.


అసలు విషయం ఏమిటంటే ఆమెకు ఒక వీక్నెస్ ఉందట అదేమిటంటే ఆమె నవ్వు ఆపుకోలేదట. ఒకసారి నవ్వొస్తే కనుక నవ్వును కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమని దాదాపు పది నుంచి 15 నిమిషాల పాటు అలాగే నవ్వుతూనే ఉంటానని ఆమె చెప్పుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మనం అనుకున్నట్లుగా పడి పడి నవ్వడం అన్నమాట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆమె తాను నవ్వడం మొదలు పెడితే షూటింగ్ ఆపేస్తారని, ఎందుకంటే నా నవ్వు 15- 20 నిమిషాలు ఉంటుంది కాబట్టి ఆ పదిహేను 20 నిమిషాల పాటు బ్రేక్ తీసుకుని అందరూ తమ తమ పనులు చూసుకుని వస్తారని చెప్పింది. ఎందుకో తెలియదు కానీ తనకు అలా కంటిన్యూ గానే నవ్వొస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు ఆమెకు నిజంగా జబ్బు ఉందేమో అనుకుని కంగారు పడ్డాం కానీ అసలు విషయం ఇదా అంటూ నోరు వెళ్ళబెడుతున్నారు. ఇదైతే జబ్బే కాదు అనుష్క విషయంలో తమకు టెన్షన్ లేదు అన్నట్లుగా వారు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: 
Dhanush Silent Craze: ధనుష్ కి తెలుగులో ఏమన్నా క్రేజ్ ఉందా..అన్ని షోస్ హౌస్ ఫుల్లే!


Also Read: Shehzada vs Pathaan: 'అల' రీమేక్ కు దిమ్మతిరిగే షాక్.. దెబ్బకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook