అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడలు, ట్రంప్ జూనియర్ సతీమణి అయిన వనెస్సా ట్రంప్ ఈ మధ్యకాలంలో ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండడంతో మళ్లీ వార్తలలో నిలిచారు. కొన్ని నెలల క్రితం ట్రంప్ జూనియర్‌తో విడాకులు తీసుకుంటారని వార్తలు వచ్చాక.. ఆమె ఆ తర్వాత బాగా లో ప్రొఫైల్ మెయిన్‌టైన్ చేయడంతో ఆమె గురించి దాదాపు అందరూ మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తర్వాత ఆమె మళ్లీ తన ట్వీట్ల ద్వారా నెటిజన్లలో ఆసక్తిని నింపారు. తన పిల్లలతో కలిసున్న ఫోటోలను పోస్టు చేస్తూ ఆన్‌లైన్‌లో హల్చల్ చేస్తున్నారు. అలాగే తన మామగారైన డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ట్వీట్లను కూడా రీట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ జూనియర్ దంపతులు విడాకులకు స్వస్తి చెప్పి..  మళ్లీ జీవితం కొనసాగిస్తారా అన్ని అనుమానం కూడా నెటిజన్లలో తలెత్తింది. 


ఇప్పటికే ఈ జంట విడాకుల విషయం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆబ్రే ఓడే అనే హాలీవుడ్ గాయనితో జూనియర్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని వార్తలొచ్చాయి. అలాగే ట్రంప్ కోడలు కూడా మరో రిలేషన్ షిప్ కోసం ఎదురుచూస్తున్నట్లు కూడా కొందరు వార్తలు రాశారు. గతంలో ఆమె లాటిన్ రాజు, సౌదీ యువరాజుతో పాటు హాలీవుడ్ నటుడు లియోనార్డో డి కాప్రియోతో డేటింగ్ చేసిందని కూడా కొన్ని వార్తలు వచ్చాయి.


ఏదేమైనా.. ట్రంప్ కోడలు కాబట్టే వనెస్సా గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక సాధారణ మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన వనెస్సాని ట్రంప్ జూనియర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2005లో ఆమెను ప్రపోజ్ చేసి 100,000 డాలర్ల విలువైన ఉంగరాన్ని కూడా బహుకరించాడు ట్రంప్ జూనియర్.