బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తన తండ్రి డేవిడ్ ధావన్ పుట్టినరోజు సందర్భంగా ఓ వినూత్న కానుక ఇవ్వాలని భావించారు. మంచి చొక్కా కొనిస్తే ఎలా ఉంటుంది? అని ముందు అనుకున్నారట. అయితే అందులో స్పెషాలిటీ ఏముంది..? అందుకే తానే స్వయంగా ఓ చొక్కా కుట్టి ఇస్తే ఎలా ఉంటుంది.. అని మళ్లీ అనుకున్నారట ఆయన. సూపర్ ఐడియా కదా..? అని అందరూ చెప్పగానే తన చేతులతో స్వయంగా చొక్కా కుట్టి తన తండ్రికి గిఫ్ట్‌‌గా ఇచ్చారట. ఇంతకీ వరుణ్ ధావన్ కుట్టుపని ఎక్కడ నేర్చుకున్నారు అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ.. వరుణ్‌కి నిజంగానే కుట్టుపని వచ్చు. ‘సూయి ధాగా’ అనే చిత్రంలో వరుణ్ టైలర్‌‌గా నటిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో కథాంశమంతా కూడా టైలర్ చుట్టే నడుస్తుంది కాబట్టి కుట్టుపని నేర్చుకోవడం తప్పనిసరి అనే చెప్పారట దర్శకుడు. అందుకే ఆ సినిమా కోసం కుట్టుపని నేర్చుకున్నాడు వరుణ్ ధావన్. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ దర్జీ జీవితం చుట్టూ తిరుగుతుంది. భారతీయ సంప్రదాయ దుస్తుల విలువను చెప్పడానికే ఈ చిత్రాన్ని తీస్తున్నాం అంటున్నారు దర్శకులు శరత్ కటారియా.


[[{"fid":"173070","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈ సినిమాలో వరుణ్ సరసన అనుష్క శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అను మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 28 సెప్టెంబరు 2018 తేదిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శరత్ కటారియా గతంలో 10 ఎంఎల్ లవ్, దమ్ లాగాకే హైసా చిత్రాలకు డైరెక్షన్ వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్సే వస్తోంది.