Coronavirus కారణంగా ఈ మధ్య సినిమాలు ఎక్కువగా ఒటిటిలోనే రిలీజ్ అవుతున్నాయి. అలాగే విద్యా బాలన్ ( Vidya Balan ) ప్రధాన పాత్రలో నటించిన శకుంతలా దేవి ( Shakuntala Devi's biopic ) చిత్రం కూడా ఓటీటీ ద్వారానే విడుదలైన సంగతి తెలిసిందే. దివంగత గణిత శాస్త్రజ్ఞురాలుగా ఆమె చేసిన పాత్రకు మంచి ప్రసంశలు దక్కాయి. శకుంతలా దేవి తర్వాత విద్యా బాలన్ ఖాతాలో ఇంకొన్ని క్రేజీ బయోపిక్స్ కూడా ఉన్నట్టు సమాచారం. వాటిలో ఒకటి భారత దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ( Indira Gandhi's biopic ) జీవిత కథ ఆధారంగా నిర్మించబోతున్న చిత్రం. ఈ చిత్రాన్ని విద్యా బాలన్ భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించాల్సి ఉంది. Also read : SSR death case: బీహార్ పోలీసులపై కేసు.. స్పందించిన డీజీపీ


ఐతే ఇప్పుడు ఈ చిత్రం వాయిదా పడినట్లు విద్యా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రానికి చాలా పరిశోధనలు అవసరమని, దీనికి సమయం పడుతుందని వెల్లడించారు. ఈ సంవత్సరం చివరలో ఈ చిత్రం సైట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా.. కరోనావైరస్ అన్ని ప్రణాళికలను తలకిందులు చేసింది. కాబట్టి 2021 లోనే ఇందిరా గాంధీ బయోపిక్ సైట్స్‌పైకి వెళ్తుందని విద్యా బాలన్ పేర్కొన్నారు. Also read : SS Rajamouli: గుడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి