నా నెక్ట్స్ మూవీ ఆయనతోనే: వీవీ వినాయక్
నా నెక్ట్స్ మూవీ ఆయనతోనే: వీవీ వినాయక్
బాలయ్యతో తన నెక్స్ట్ మూవీ ఉంటుందని వీవీ వినాయక్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నారని.. ఆ చిత్రం ముగియగానే తమ ప్రాజెక్టు మొదలవుతుందని వినాయక్ తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయన్న వినాయక్.. బాలయ్యతో తప్ప మరెవరితోనూ సినిమా చేయడం లేదని అన్నారు. గతంలో బాలయ్య-వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'చెన్నకేశవ రెడ్డి' లాగే.. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. అప్పడే దీనికి 'ఏకే 47' అనే టైటిల్ ప్రచారంలో నడుస్తోంది.
జూన్ నెలలో బాలకృష్ణ పుట్టినరోజు నాడు ఆయనకు విషెష్ తెలుపుతూ.. సీకె ఎంటర్‌టైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్‌లో బాలయ్యతో సినిమా చేస్తున్నట్లు వినాయక్ ప్రకటించారు. అయితే స్క్రిప్ట్ పనులు పూర్తి కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. వినాయక్ కథ బాలయ్యకు నచ్చలేదని దీంతో ‘ఎన్టీఆర్’ చిత్రం తరువాత బాలయ్య.. బోయపాటితో చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వీవీ వినాయక్ బాలయ్యతోటే తన నెక్స్ట్ మూవీ ఉంటుందంటూ చెప్పేశారు. వీవీ వినాయక్ చివరగా దర్శకత్వం వహించిన సినిమా సాయి ధరమ్ తేజ్ నటించిన 'ఇంటలిజెంట్'.