How to Lose Weight: ఈ డైట్లను అనుసరించండి చాలు..కేవలం 7 రోజుల్లో బరువు తగ్గుతారు..
Weight Control In 7 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటూ ఉన్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వీరిలో శరీర బరువు పెరగడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు.
Weight Control In 7 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటూ ఉన్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వీరిలో శరీర బరువు పెరగడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి వారు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వారు ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీరు తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే బరువు తగ్గలేరని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి నియమాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కీటో డైట్:
బరువు తగ్గడానికి ప్రస్తుతం కీటో డైట్‌ను ఫాలో అవుతున్నారు. అయితే ఈ కీటో డైట్‌లో భాగంగా ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పిండి పదార్థాలు తక్కువగా తీసుకుంటారు. అయితే ఈ డైట్‌ను రెగ్యూలర్‌గా పాటించడం వల్ల సులభంగా బీపీ సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా పని చేస్తుంది. కాబట్టి బరువు తగ్గే క్రమంలో ఈ డైట్ పాటించడం చాలా మేలు.
పాలియో డైట్:
ఈ డైట్‌లో భాగంగా ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకునేందుకు అధికంగా ప్రాధాన్యతను ఇస్తారు. ఈ క్రమంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, నాన్ వెజ్ ఐటమ్స్ తినాలని నిపుణులు సూచించారు. అంతేకాకుండా ఈ డైట్ పాటించే క్రమంలో పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ ఆహారం వల్ల శరీరానికి పుష్కలంగా ప్రొటీన్లు అందుతాయి. కాబట్టి ఎముకలలో నొప్పి, బలహీనత సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గే క్రమంలో ఈ డైట్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
క్రాష్ డైట్:
బరువు తగ్గడానికి ఈ డైట్‌ను చాలా మంది ఎంచుకుటున్నారు. ఈ డైట్‌లో తీసుకునే ఆహారాల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ డైట్‌ను క్రమంగా అనుసరిస్తే.. శరీరంలో జీర్ణ క్రియ శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా రక్త సమస్యలతో బాధపడేవారికి ఈ డైట్ ప్రభావవంతంగా పని చేస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook