Whatsapp New Features: వాట్సప్ కొత్తగా మూడు ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఇతరులకు తెలియకుండానే గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవడం వంటి కొత్త ఫీచర్లను వాట్సప్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సప్ మాతృసంస్థ మెటా కొత్తగా మూడు ఫీచర్లను ప్రకటించింది. ఈ మూడు యూజర్ ప్రైవసీకు సంబంధించినవి. తమ సంభాషణలు, మెస్సేజిలపై యూజర్‌కు మరింత నియంత్రణ తీసుకువచ్చే ఫీచర్లు ఇవి. గ్రూపులో మరొకరికి తెలియకుండా ఎగ్జిట్ అయ్యే ఫీచర్ మరొకటి. మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు స్క్రీన్‌షాట్స్, వ్యూ వన్స్ మెస్సేజిలను మరొకరు చూడకుండా కంట్రోల్ చేసే ఫీచర్ ఒకటి. 


మీ మెస్సేజెస్‌ను సెక్యూర్ చేసేందుకు కొత్త కొత్త పద్ధతుల్ని అణ్వేషిస్తుంటామని..వ్యక్తిగతంగానే కాకుండా ఫేస్ టు ఫేస్ సంభాషణలుగానే ఉంచేందుకు ప్రయత్నిస్తామని మెటా అధినేత మార్క్ జుకెర్‌బర్గ్ తెలిపారు. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ల ద్వారా..వాట్సప్ యూజర్లు..గ్రూపులో ఎవరికీ తెలియకుండానే ఎగ్జిట్ కావచ్చు. మరోవైపు కేవలం అడ్మిన్లకు మాత్రమే తెలిసేలా కూడా గ్రూప్ నుంచి ఎగ్జిట్ కావచ్చు. ఈ ఫీచర్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. 


మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరు చూడవచ్చు. ఎవరు చూడకూడదనేది మీరే నిర్ణయించుకునే వెసులుబాటుతో మరో కొత్త ఫీచర్ అందుబాటులో వచ్చింది. ఈ ఫీచర్ కూడా ఆగస్టు నెలలో ప్రారంభం కానుంది. స్క్రీన్‌షాట్స్‌ను బ్లాక్ చేసేందుకు వ్యూ వన్స్ ఆప్షన్ తీసుకొస్తోంది. ఇది మీ మెస్సేజ్‌లకు అదనపు రక్షణ కవచంగా ఉంటుంది. ఈ ఫీచర్ ఇప్పటికే టెస్టింగ్ పూర్తయింది. త్వరలో అందుబాటులో రానుంది. 


గత కొన్నేళ్లుగా యూజర్ల సంభాషణల్ని సెక్యూర్ చేసేందుకు ఎప్పటికప్పుడు రక్షణ కవచాలు ఏర్పాటు చేస్తూ కొత్త ఫీచర్లు అందుబాటులో తీసుకొస్తున్నామని..వ్యక్తిగత ప్రైవసీకై మా అంకితభావం దిశగా ప్రయత్నిస్తున్నామని వాట్సప్ వెల్లడించింది. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ మూడు ఫీచర్ల ప్రచారం కోసం త్వరలో గ్లోబల్ క్యాంపెయిన్ యూకే, ఇండియాలో ప్రారంభిస్తున్నామని సంస్థ తెలిపింది. 


Also read: Multibagger Stock: ఒకప్పుడు 15 రూపాయల షేర్..ఇప్పుడు 3 వేల రూపాయలు, ఊహించని లాభాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook