ఇండియాలో బాహుబలి మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే..! అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా బాహుబలి రికార్డులకెక్కింది. ఈ చిత్రం రికార్డులను బ్రేక్ చేయాలంటే చాలా కష్టం. బాహుబలి చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడు ఏ చిత్రం బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. క్రింద పేర్కొన్న ఈ చిత్రాలకు బాహుబలి రికార్డులను బ్రేక్ చేయగల సత్తా ఉందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో సవాళ్లు చేసుకుంటున్నారు. ఈ  రాబోయే భారీ బడ్జెట్ సినిమాలు బాహుబలి రికార్డులను బ్రేక్ చేయగలవా లేదో వేచి చూడాల్సిందే..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోబో 2.0


రోబో 2.0 చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. భారత సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.450 కోట్లు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిగా 3డి ఫార్మాట్‌లో, అలాగే ఎక్కువ సన్నివేశాలు గ్రాఫిక్ మాయాజాలం ఉపయోగించి తీసారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14, 2018 తేదిన తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.


మహావీర్ కర్ణ


దక్షిణ భారతీయ చిత్రాల్లో మరోక బిగ్గెస్ట్ సినిమా "మహావీర్ కర్ణ". ఈ చిత్రంలో దక్షిణాది సూపర్ స్టార్ విక్రమ్ కర్ణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అర్.ఎస్ విమల్ దర్శకత్వం వహించనున్నారు. న్యూయార్క్‌కి చెందిన ప్రొడక్షన్ హౌస్ యునైటెడ్ ఫిలిం కింగ్ డం ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అక్టోబర్ 2018లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుందని సమాచారం. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా 2019లో హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీని రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారు.


సాహో


బాహుబలి విజయం తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం సాహో. ఈ చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలువడానికి ప్రయత్నిస్తోంది. బాహుబలి తరువాత దేశ వ్యాప్తంగా ప్రభాస్ చాలా పాపులర్ అయ్యాడు. ఇప్పటికే మూవీ టీజర్ యూట్యూబ్‌లో రిలీజై అభిమానుల్ని ఆకట్టుకుంది. సుజీత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. సినిమా బడ్జెట్ రూ.180 కోట్లు.


సైరా నరసింహారెడ్డి


చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార తదితరులు నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు, చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.  ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్ భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. సినిమా బడ్జెట్ 150 కోట్లు.


మహాభారతం


ప్రముఖ యాడ్‌ ఫిలింమేకర్‌ వీఏ శ్రీకుమార్‌ మేనన్..ఎంటీ వాసుదేవన్‌ రాసిన ‘రందమూఝామ్‌’ నవల ఆధారంగా మహాభారత గాథను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని మీడియా కథనం. ఈ సినిమా నిర్మాణంలో సౌదీఅరేబియాకి చెందిన ఎన్ఆర్ఐ భగవంతు రఘురాం శెట్టి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా చిత్రీకరించనున్నారు. అదేవిధంగా దేశంలోని, ప్రపంచంలోని ఇతర భాషల్లోకి అనువదిస్తారు. రెండు భాగాల్లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ 2018 సెప్టెంబరులో ప్రారంభం కానుంది. 2020లో విడుదల అవ్వొచ్చని అంచనా.


రామాయణం


అల్లు అరవింద్ 'రామాయణ' మహాకావ్యాన్ని తెరకెక్కించనున్నాడని టాక్. అయితే ఈ ప్రాజెక్ట్‌కి  రూ.500 కోట్లు ఖర్చు పెట్టాలని మాత్రమే ప్రస్తుతానికి ఫిక్సయ్యారు. ఓ రెండు భాగాలుగా 'సంపూర్ణ రామాయణాన్ని' సినిమాగా తీయాలని అల్లు అరవింద్.. మధు మంతెన.. నమిత్ మల్హోత్రా నిర్ణయించుకున్నారట. అయితే ఇది  హిందీ సినిమా అని.. స్థానిక భాషల్లోకి అనువదిస్తారని కొందరు అంటుంటే, 'అల్లు అర్జున్'తో ఆంజనేయుడి వేషం వేయించే ఛాన్సుందని ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది.  డైరక్టర్, హీరో, క్యాస్టింగ్ ఎవరెవరు అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.