టియా ఫ్రీమాన్ అనే విదేశీ మహిళకు ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ దేశాలు తిరుగుతూ ఉండే ఆమె తనకు గర్భమని తెలిసినా కూడా ప్రయాణాన్ని వాయిదా వేసుకోలేదు. ధైర్యంగా జర్మనీ బయలుదేరింది. అక్కడ ఓ హోటల్ కూడా బుక్ చేసుకుంది. అయితే ఆమె ఒంటరిగా హోటల్‌లో ఉండే సమయంలో అనుకోకుండా నొప్పులు మొదలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటి సందర్భంలో ఆమెకు యూట్యూబ్ గుర్తుకొచ్చింది. ఇంకేముంది.. అనుకున్నదే తడవుగా ఆమె యూట్యూబ్‌లో పురుడు ఎలా పోసుకోవాలో చెప్పే వీడియోలు చూసి.. వాటి సహాయంతో తన పురుడు తానే పోసుకుంది. పండింటి బిడ్డకూ జన్మనిచ్చింది. అయితే తాను ఈ ప్రక్రియ అంతా ఎలా చేసిందనే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలపడం గమనార్హం. 


ముఖ్యంగా తాను ధైర్యం కోల్పోలేదని.. డెలివరీ గురించి తనకు కనీస అవగాహన ఉండడం వల్ల ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లానని తెలిపారు టియా ఫ్రీమాన్. అయితే పేగు కోసే ప్రక్రియ కొంత భయాన్ని కలిగించిందని.. అయినా సంకల్పంతో తాను ఆ పనిచేయగలిగిందని అంటుందామె. ఇది ఓ మరుపురాని అనుభూతి అని.. అప్పటికప్పుడు ఆసుపత్రికి వెళ్లే అవకాశం లేనందునే తాను ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపింది.