Xiaomi smartphones: రెడ్‌మి ఫోన్లు కస్టమర్ల డేటాను దొంగిలిస్తున్నాయా ?
చైనాకు చెందిన షియోమి స్మార్ట్ ఫోన్స్ (Xiaomi smartphones) కస్టమర్ల డేటాను దొంగిలిస్తున్నాయా అంటే అవుననే ఆరోపణలే వ్యక్తమవుతున్నాయి. ఫోర్బ్స్.కామ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం గబి సిర్లిగ్ అనే సైబర్ సెక్యురిటీ రిసెర్చర్ (cybersecurity researcher Gabi Cirlig) తాను వినియోగిస్తున్న రెడ్ మి నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ( Redmi Note 8 phone) ఈ విషయాన్ని పసిగట్టినట్టు తెలుస్తోంది.
చైనాకు చెందిన షియోమి స్మార్ట్ ఫోన్స్ (Xiaomi smartphones) కస్టమర్ల డేటాను దొంగిలిస్తున్నాయా అంటే అవుననే ఆరోపణలే వ్యక్తమవుతున్నాయి. ఫోర్బ్స్.కామ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం గబి సిర్లిగ్ అనే సైబర్ సెక్యురిటీ రిసెర్చర్ (cybersecurity researcher Gabi Cirlig) తాను వినియోగిస్తున్న రెడ్ మి నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ( Redmi Note 8 phone) ఈ విషయాన్ని పసిగట్టినట్టు తెలుస్తోంది. రెడ్‌మి ఫోన్‌లో (Redmi) ఇంటర్నెట్ బ్రౌజింగ్ డేటాతో (Interner browsing data) పాటు మొబైల్లోని మొమొరీలో తాను ఏమేం ఉపయోగించానో ఆ డేటాను రెడ్‌మి ఫోన్ స్టోర్ చేస్తోందని గబి ఆరోపించినట్టుగా ఫోర్బ్స్ కథనం పేర్కొంది. ఫోన్‌తో వచ్చిన డీఫాల్ట్ బ్రౌజర్‌లోనే కాకుండా ఇన్‌కాగ్నిటో మోడ్ (Incognito mode) ద్వారా ప్రైవేటు విండోలో సెర్చ్ చేసిన డేటాను కూడా షియోమి ఫోన్లు చౌర్యం చేస్తున్నాయని గబి ఆరోపించినట్టుగా ఈ కథనంలో పేర్కొన్నారు.
Also read: Breaking: మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్రం
అయితే, కేవలం గబి ఆరోపణలతో సరిపెట్టుకోకుండా.. ఈ ఆరోపణలను పరిశీలించాల్సిందిగా సైబర్ సెక్యురిటీ పరిశోధకుడు అయిన ఆండ్రూ టియర్నిని సంప్రదించగా.. అతడు కూడా అది నిజమేనని ధృవీకరించినట్టుగా ఫోర్బ్స్ స్పష్టంచేసింది. అంతేకాకుండా గూగుల్ ప్లేలో (Google play) అందుబాటులో ఉన్న షియోమికి చెందిన ఎంఐ బ్రౌజర్ ప్రో యాప్ (Mi browser pro), మింట్ బ్రౌజర్ యాప్ (Mint browser app) కూడా డేటాను తస్కరిస్తున్నట్టుగా తేలిందని ఫోర్బ్స్ కథనం వెల్లడించింది.
Also read : అప్పటివరకు విమానాలు, రైల్వే, మెట్రో సేవలు రద్దు
ఇదిలావుంటే పోర్బ్స్ కథనంపై స్పందించిన షియోమి.. ''ఫోర్బ్స్ కథనం తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది'' అని పేర్కొంది. డేటా ప్రైవసీ (Data privacy) విషయంలో తాము అవలంభిస్తున్న విధానాలను బహుశా ఫోర్బ్స్ అపార్థం చేసుకున్నట్టుగా ఉంది కాబోలు అని షియోమి అభిప్రాయపడింది. ఫోర్బ్స్ రాసిన ఈ అసత్య కథనంపై సంస్థ కూడా ఫోర్బ్స్ యాజమాన్యంతో మాట్లాడినట్టుగా షియోమి ప్రకటించింది. ఈ మేరకు షియోమి నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఏదేమైనా యాపిల్ (Apple), శాంసంగ్ (Samsung) లాంటి స్మార్ట్ ఫోన్ దిగ్గజాల తర్వాతి స్థానంలో ఉన్న ఈ చైనీస్ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ విక్రయాలపై డేటా చౌర్యం ఆరోపణలు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదని స్మార్ట్ ఫోన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..