Breaking: మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్రం

మే 3తో ముగియనున్న లాక్ డౌన్ ను కేంద్రం మరో రెండు వారాలపాటు పొడిగించింది. తాజా ఆదేశాల ప్రకారం మే 17వ తేదీ వరకు భారత్ లో లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

Last Updated : May 1, 2020, 07:29 PM IST
Breaking: మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్రం

న్యూ ఢిల్లీ: మే 3తో ముగియనున్న లాక్‌డౌన్‌ను కేంద్రం మరో రెండు వారాలపాటు పొడిగించింది. తాజా ఆదేశాల ప్రకారం మే 17వ తేదీ వరకు భారత్‌లో లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోంశాఖ ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 24న తొలిసారిగా 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించింది. తొలిసారి విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14న ముగియాల్సి ఉండగా.. కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం లాక్ డౌన్ ని పొడిగించక తప్పడం లేదంటూ కేంద్రం మరోసారి లాక్ డౌన్ ని పొడిగించింది. కేంద్రం రెండోసారి పొడిగించిన లాక్ డౌన్ మే 3తో ముగియాల్సి ఉందనగా.. అంతకంటే రెండు రోజుల ముందే మే 1న లాక్ డౌన్ పై కేంద్రం మూడోసారి ఆదేశాలను జారీ చేసింది. తాజా ఆదేశాలు మే 4 నుంచి అమలులోకి వస్తాయని కేంద్రం స్పష్టంచేసింది. 

Also read : రాయితీ లేని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై రూ 162.50 తగ్గింపు

కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తున్న తీరు చూస్తోంటే.. కరోనా వైరస్‌ను నివారించాలంటే జనాలు భౌతిక దూరం పాటించడం ఎంత అవసరం ఉందనేది ఇట్టే అర్థమవుతోంది. అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో సకాలంలో లాక్ డౌన్ పాటించకపోవడం వల్లే అక్కడ ఏ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News