Yatra Online IPO: ఐపీఓకు దరఖాస్తు చేసుకున్న ప్రముఖ ట్రావెలింగ్ కంపెనీ యాత్ర!
Yatra Online IPO: ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ యాత్రా ఆన్ లైన్ ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంది. అందుకోసం సెబీకి అవసరమైన పత్రాలను శనివారం సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా రూ. 750 కోట్ల విలువైన షేర్లను విక్రయించేందుకు ఆస్కారం ఉంది.
Yatra Online IPO: ప్రముఖ ఆన్ లైన్ ట్రావెలింగ్ సంస్థ యాత్రా ఆన్ లైన్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూకి దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో యాత్రా సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి అవసరమైన పత్రాలను శనివారం సమర్పించింది. దాదాపుగా రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో పాటు 93,28,358 ఈక్విటీ షేర్లు ఆఫర్ ఫర్ సేల్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
వ్యూహాత్మక పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలు వంటి వాటి కోసం ఈ ఐపీఓ నుంచి వచ్చే డబ్బును యాత్రా సంస్థ వెచ్చించనుంది. SBI Capital మార్కెట్స్ లిమిటెడ్, DAM క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్, IIFL సెక్యూరిటీస్ లిమిటెడ్ లీడ్ వంటివి ఈ సంస్థకు మేనేజర్లుగా ఉన్నాయి. యాత్రా ఆన్‌లైన్ లిమిటెడ్ మాతృ సంస్థ 'యాత్రా ఆన్‌లైన్ ఇంక్'.. ఇప్పటికే అమెరికాలోని స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయ్యింది.
ఐపీఓ డబ్బును ఎలా సేకరిస్తారు?
నివేదికల ప్రకారం.. ఈ పబ్లిక్ ఇష్యూలో THCL ట్రావెల్ హోల్డింగ్స్ సైప్రస్ లిమిటెడ్ ద్వారా 88,96,998 ఈక్విటీ షేర్లు, పండారా ట్రస్ట్ - స్కీమ్ I ద్వారా 4,31,360 వరకు ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. పండారా ట్రస్ట్ తన ట్రస్టీ Vistra ITC ద్వారా వాటి విక్రయాలను జాబితా చేస్తుంది. ఇందులో ప్రైవేట్ ప్లేస్ మెంట్ కోసం రూ. 145 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.
Also Read: Airtel Big Offer: ఉచితంగా ప్రైమ్, సోని లివ్ OTTసభ్యత్వం.. అదికూడా ఎయిర్‌టెల్ తో..
Also Read: Disney plus hotstar: డిస్నీ+ హాట్‌స్టార్ అధ్యక్ష పదవిని వీడిన సునీల్ రాయన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook