Disney plus hotstar: డిస్నీ+ హాట్​స్టార్​ అధ్యక్ష పదవిని వీడిన సునీల్ రాయన్!

Disney plus hotstar: డిస్నీ+ హాట్​స్టార్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు సునీల్​ రాయన్​. ఈ విషయాన్ని.. డిస్నీ ఇండియా  అండ్​ స్టార్ ఇండియా అధ్యక్షుడు కె. మాధవన్ అధికారికంగా ధృవీకరించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2022, 06:57 PM IST
  • డిస్నీ+ హాట్​స్టార్​ అధ్యక్షుడు రాజీనామా
  • వ్యక్తిగత కారణాలే కారణం
  • అధికారికంగా ప్రకటించిన డిస్నీ ఇండియా అధ్యక్షుడు
Disney plus hotstar: డిస్నీ+ హాట్​స్టార్​ అధ్యక్ష పదవిని వీడిన సునీల్ రాయన్!

Disney plus hotstar: ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ డిస్నీ+ హాట్ స్టార్​ ఇండియా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు సునీల్ రాయన్​. వ్యక్తిగత కారణాలతోనే తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిసింది. 2020 జూన్​లో డిస్నీ+ హాట్ స్టార్​ ఇండియా అధ్యక్షుడిగా నియమితులయ్యారు సునీల్​ రాయన్​. అంతకు ముందు గూగుల్ క్లౌడ్​ ఫర్ గేమ్స్ విభాగానికి ఎండీగా సేవలందించారాయన.

డిన్నీ+ హాట్​స్టార్ బాధ్యతల నుంచి రాయన్​ తప్పుకున్న విషయాన్ని వాల్డ్​ డిస్నీ ఇండియా  అండ్​ స్టార్ ఇండియా అధ్యక్షుడు కె. మాధవన్.. సంస్థ ఉద్యోగులకు పంపిన మేయిల్​లో తెలిపారు.

ఈ మేరకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు మాధవన్​. దాదాపు రెండేళ్లపాటు రాయన్ అందించిన​ సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వంలో కంపెనీ మంచి విజయాలను అందుకోగలిగిందన్నారు. వ్యక్తిగత కారణాలతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వివరించారు.

Also read: Airtel Big Offer: ఉచితంగా ప్రైమ్, సోని లివ్ OTTసభ్యత్వం.. అదికూడా ఎయిర్‌టెల్ తో..

Also read: Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకం ద్వారా పొదుపు చేస్తే డబ్బు రెట్టింపు ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News