3 Ways to Lose Belly Fat: ప్రతి ఒక్కరూ అందంగా సన్నగా కనిపించేందుకు కోరుకుంటారు.  ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి సన్నగా కనిపించేందుకు కష్టపడి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గడం అనేది అంత ఈజీ కాదు.. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతకంటే ముఖ్యమైనది శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం చాలామంది బరువు తగ్గే క్రమంలో క్యాలరీలు అధిక పరిమాణంలో లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి తప్పులు చేయకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించి సులభంగా బరువు బరువు తగ్గవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు పెరిగే వారిలో పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ సులభంగా పెరుగుతుంది. కాబట్టి ఇలా బెల్లీ ఫ్యాట్ పెరగడం కారణంగా చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడేవారు రోజు సాయంత్రం 6 గంటలలోపే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా బరువు తగ్గే సమయంలో ఎప్పుడు పొట్ట నిండుగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట తీసుకునే భోజనంలో కేవలం పండ్లు ఓట్స్ తో తయారు చేసిన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


అంతేకాకుండా బరువు తగ్గే క్రమంలో ప్రతిరోజు మధ్యాహ్నం పూట కూడా పండ్లు ఇతర పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బెల్లీ ఫ్యాట్ ఉన్నవారు తప్పకుండా అన్నాన్ని తినడం మానుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు రాత్రంతా పొట్ట ఖాళీగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇలా ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


శరీర బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ నియంత్రణలో ఉండడానికి వ్యాయామాలు కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఒక గంట చొప్పున తప్పకుండా వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని వారు అంటున్నారు. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వాకింగ్ తో పాటు యోగ, వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి