రోజుకు 45 నిమిషాల వ్యాయామంతో శరీరంలో క్యాన్సర్ కు చెక్!
45 Minutes Exercise Daily: శరీరంలోని కాన్యర్ కారకాలను అణచివేసేందుకు వ్యాయామం సహకరిస్తుందని అమెరికా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యం బారిన పడే అవకాశం తక్కువని అధ్యయనం చెబుతోంది. ఇదే విషయాన్ని భారతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజలందరూ వ్యాయామం తప్పక చేయాలని సూచిస్తున్నారు.
45 Minutes Exercise Daily: ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల వ్యాయామంతో (అంటే వారంలో 300 నిమిషాలు) శరీరంలో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఇటీవలే అధ్యయనంలో తేలింది. ఇదే విషయాన్ని భారతదేశంలోని కొందరు వైద్య నిపుణులు ధ్రువీకరించారు. వ్యాయామం చేయకపోవడం వల్ల చాలా మంది అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడొచ్చని సూచించారు.
అమెరికాలో ఇనాక్టివిటీ, వ్యాయామం, ప్రాణాంతక వ్యాధులపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ప్రజలు రోజుకు కనీసం 45 నిమిషాలు నడిస్తే.. ఏడాదికి 46 వేల కంటే ఎక్కువగా క్యాన్సర్ కేసులను నివారించవచ్చని తేలింది. కొలంబియాలోని దాదాపుగా 6 లక్షల మంది అమెరికన్ పురుషులు, స్తీలపై చేసిన ఈ అధ్యయనంలో వ్యాయామం ద్వారా క్యాన్సర్ కారకాలు బలహీన పడే అవకాశం ఉందని అధ్యయనం ద్వారా కనుగొన్నారు. ఇదే విషయాన్ని భారతీయ వైద్య నిపుణులూ ధ్రువీకరించారు.
నోయిడాలోని సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ హాస్పిటల్, పీజీ టీచింగ్ ఇన్‌స్టిట్యూట్ (SSPHPGT) పీడియాట్రిక్ హెమటాలజీ-ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ నీతా రాధాకృష్ణన్ దీనిపై మాట్లాడారు. “శారీరక శ్రమ వల్ల మనలో రోగనిరోధక వ్యవస్థను మెరుగవుతుంది. మన శరీరంలో, ట్యూమర్ సర్వైలెన్స్ సిస్టమ్ అని పిలుస్తారు. వ్యాయామం వల్ల రోగనిరోధక స్థితి మెరుగుపడి.. రొమ్ము, పెద్దప్రేగు వంటి కొన్ని క్యాన్సర్ కారకాలను అదుపు చేసే అవకాశం ఉంది. మనిషి శారీరకంగా చురుకుగా ఉంటే, అది తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆధునిక జీవనశైలిని పరిగణనలోకి తీసుకుంటే.. క్యాన్సర్ ప్రమాదాన్ని కనీసం 102 శాతం మేరకు వ్యాయామం ద్వారా నయం చేయవచ్చు." అని ఆమె తెలిపారు.
ఈమెతో పాటు అదే ఇనిస్టిట్యూట్ లో మాక్స్, అంకాలజీ ప్రిన్సిపల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ పి.కె. జుల్కా కూడా రోజువారి దినచర్యలో వ్యాయామం అవసరమని సూచించారు. “వ్యాయామం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వ్యాయామం వల్ల శరీరానికి మంచి చేయడమే కాకుండా.. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మన రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను చంపుతుంది, ఇది క్యాన్సర్ కణాలు పెరగడానికి అనుమతించదు. మన రోగనిరోధక వ్యవస్థ కేవలం మనలో ‘T’ లింఫోసైట్లుగా ఉంటుంది. ఈ రోగనిరోధక కణాలు క్యాన్సర్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే పుష్టికరమైన ఆహరంతో పాటు వ్యాయామం ముఖ్యమే అని నా దగ్గరకు వచ్చే పేషంట్లకు చెప్తాను. దేశంలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచిది” అని జుల్కా అన్నారు.
Also Read: Vitamin E and Dry Fruits Benefits: విటమిన్ ఇ లేకపోతే ఆ రెండింటికీ ప్రమాదమే
Also Read: Green Tea: గ్రీన్ టీ ఏయే వేళల్లో తీసుకోకూడదు, ఎలా వాడుకలో వచ్చింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook