COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 Main Causes Of Hypothyroidism: చిన్న వయసులోనే థైరాయిడ్ సమస్య బారిన పడటం వల్ల భవిష్యత్తులో అనేక దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం అయోడిన్ కలిగిన ఆహారాలను మానుకోవడం ఇతర కారణాల వల్ల ఈ థైరాయిడ్ సమస్య వస్తోంది. కాబట్టి ముందుగానే ఈ సమస్య బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా థైరాయిడ్ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనలను సలహాలను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో 18 సంవత్సరాలు నిండిన వారిలో కూడా ఈ థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి అసలు ఈ సమస్య రావడానికి కారణాలేంటి? ఈ థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ప్రతిరోజు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


థైరాయిండ్‌ రావడానికి 5 ప్రధాన కారణాలు:
అయోడిన్ లోపం: థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ అవసరం. శరీరానికి తగినంత అయోడిన్ అందకపోతే థైరాయిడ్ గ్రంథి విస్తరించి థైరాయిడ్ రావచ్చు. కాబట్టి అయోడిన్ లోపం సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు టెస్టులను చేయించుకోవడం చాలా మంచిది.


హాషిమోటోస్ థైరాయిడిటిస్: 
ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. కాబట్టి ఇది ముందుగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పై దాడి చేసి ఆ తర్వాత థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసి దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీనివల్ల కూడా కొంతమందిలో థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు.


గ్రేవ్స్ వ్యాధి: 
ఈ వ్యాధి కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధి కిందికి వస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారిలో కూడా రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయి.. థైరాయిడ్ హార్మోన్ల పై ప్రభావం పడుతుంది. దీనికి కారణంగా థైరాయిడ్ గ్రంధి నుంచి హార్మోన్ల ఉత్పత్తి అధికంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీనివల్ల కూడా కొంతమందిలో థైరాయిడ్ వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


థైరాయిడ్ కణితులు: 
థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడే కణితులు థైరాయిడ్ రావడానికి కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ముందుగానే గమనించి వైద్యులను సంప్రదించడం ఎంతో మేలు.


థైరాయిడ్ వాపు:
 కొంతమందిలో థైరాయిడ్ గ్రంథి వాపు కూడా గురవుతుంది. ఇది కూడా థైరాయిడ్ వచ్చే ముందు ఏర్పడే లక్షణం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో థైరాయిడ్ వాపు ఒక్కసారిగా పెరగడం కారణంగా కూడా థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యతో మీరు బాధపడుతుంటే తప్పకుండా ఆరోగ్య నిపుణులను సూచించండి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి