Brain Boosters Food:  ఫిట్ బాడీ కోసం, మైండ్ ఫిట్‌గా ఉండటం కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే మీ శరీరానికి ఏదైనా పని చేయాలనే ఆదేశాన్ని ఇచ్చేది మీ మెదడు. మీరు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోతే, మీ మెదడు బలహీనంగా మారుతుంది. కాబట్టి మీ మెదడు చురుకుదనంగా పనిచేయాలంటే.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు (Brain Boosters Food) ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదయం కాఫీ తాగవచ్చు
మీరు అల్పాహారంలో భాగంగా.. కాఫీని (Coffee) కూడా చేర్చుకోవచ్చు. వాస్తవానికి, ఇందులో అధిక మెుత్తంలో కెఫిన్ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు చురుకుదనంగా పనిచేసేలా చేస్తాయి. దీనివల్ల మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది.  


ఆహారంలో పసుపును చేర్చుకోండి
పసుపు (turmeric) గురించి అందరికీ తెలిసిందే. రోగాలను తగ్గించడమే కాకుండా మెదడుకు పదును పెట్టడంలోనూ ఉపయోగపడుతుంది. ఇది మెదడు కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. 


రోజూ గుడ్డు తినండి
గుడ్లలో (Egg) ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో బి-6 మరియు బి-12 విటమిన్లు కూడా ఉన్నాయి. అల్పాహారం కోసం గుడ్లు తినడం మీ మొత్తం శరీర ఆరోగ్యానికి మంచిది. గుడ్డు ఉదయం మెదడును బలోపేతం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


నారింజ కూడా ప్రయోజనకరం
మీరు మీ ఆహారంలో నారింజను (orange) కూడా చేర్చుకోవచ్చు. మీరు ప్రతిరోజూ ఒక నారింజ తినవచ్చు. నారింజలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి అనేది మెదడు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌కు చెక్ పెడుతుంది. 


వాల్నట్-బాదం
వాల్‌నట్స్ (Walnuts) మరియు బాదం(Almonds) వంటి డ్రైప్రూట్స్ కూడా మెదడుకు చాలా మంచిది. వీటిని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోండి. ఇవి మెదడును దెబ్బతీసే కణాలతో పోరాడుతాయి. అలాగే మీరు మీ ఆహారంలో బ్రోకలీని (Broccoli) చేర్చుకోవచ్చు. ఇది మీ మెదడును చురుకుగా పనిచేయడంలో సహాయపడుతుంది.  


Also Read: Cholesterol Control Tips: మామిడి పండుతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కు చెక్! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.