7-day Protein Diet Plan: బరువు తగ్గడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలి అని తరుచుగా అన్వేషిస్తున్నాం. అయితే బరువు తగ్గించే ఆహారంలో ప్రోటీన్‌ కీలకమైన ప్రాత పోషిస్తుంది. ప్రోటీన్‌ బరువు తగ్గడంలో ఎలా సహాయపడుతుంది అనే ఆంశంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

✴ ప్రోటీన్ -బరువు కనెక్షన్:  ప్రోటీన్ అనేది బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించే కీలకమైన మాక్రోన్యూట్రియెంట్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక ప్రోటీన్‌ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. మీరు తీసుకోనే ఆహారంలో 18-30 శాతం ప్రోటీన్‌ ఉండాని. కార్బోహైడ్రేట్లు , కొవ్వు, తక్కువ తీసుకోవడం వల్ల బరువు సులువుగా తగ్గుతారు.  అయితే దీనిని ఎలా మన ప్రతిరోజు తీసుకోవాలి అనే దానికిపై మనం తెలుసుకుందాం.


✴  బరువు తగ్గడం కోసం 7-రోజుల ప్రోటీన్ డైట్ ప్లాన్‌....


బరువు తగ్గడానికి 7-రోజుల ప్రోటీన్ డైట్ ప్లాన్ మీకు సహాయపడుతుంది.  ఈ డైట్ ప్లాన్‌ లో మొత్తం రోజువారీ కేలరీలలో  20 శాతం కంటే ఎక్కువ ప్రోటీన్ నుంచి 50 శాతం కార్బోహైడ్రేట్ల, 20-25 శాతం కొవ్వు గురించి చెప్పతుంది.


✴  డే-1 ప్లాన్‌:


ఉదయం: నానబెట్టిన బాదం, రెండు నానబెట్టిన వాల్‌నట్‌లు
టిఫిన్: వేరుశెనగలు, ఉడికించిన ఎగ్‌, పోహా
లంచ్: స్ప్రౌట్ సలాడ్ 1 కప్పు, గోధుమ చపాతీ, మేతి పాలక్ కూర, రైతా
సాయంత్రం: ఒక గ్లాస్‌  పానీయం
డిన్నర్: కెన్ బ్రౌన్ రైస్, కాల్చిన కూరగాయలు, పెరుగు
రాత్రి: ఒక గ్లాస్‌ స్కిమ్డ్ మిల్క్


✴  డే- 2 ప్లాన్‌:


ఉదయం: నాలుగు నానబెట్టిన బాదంపప్పులతో నిమ్మకాయ రసం
టిఫిన్: ఎగ్ పరాటా, గ్రీన్ చట్నీ, మజ్జిగ
లంచ్: జొన్న రోటీ, చికెన్ కర్రీ, వెజ్జీ సలాడ్
సాయంత్రం: ఉడికించిన చనా మసాలా చాట్
డిన్నర్: గ్రిల్డ్ టోఫు, టమోటా సూప్‌తో వేయించిన కూరగాయలు
రాత్రి: ఒక గ్లాస్‌ స్కిమ్డ్ మిల్క్ 


✴  డే- 3 ప్లాన్‌:


ఉదయం: నానబెట్టిన ఎండుద్రాక్ష
టిఫిన్: కూరగాయలతో కూడిన గోధుమ ఉప్మా
లంచ్: పనీర్ భుర్జీ, చపాతీ, చనా సలాడ్,మజ్జిగ
సాయంత్ర: వేరుశెనగ వెన్న, ఒక ఆపిల్
డిన్నర్: మూంగ్ పప్పు, కాల్చిన టోఫుతో బ్రౌన్ రైస్
రాత్రి: ఒక గ్లాస్‌ స్కిమ్డ్ మిల్క్


✴  డే-  4 ప్లాన్‌:


ఉదయం: నానబెట్టిన వాల్‌నట్‌, బాదం
టిఫిన్: గుడ్డు, శాండ్‌విచ్, చియా పుడ్డింగ్
లంచ్: చపాతీ, వెజిటబుల్ రైటా, చేపల కూర
సాయంత్రం: సత్తు మజ్జిగ
డిన్నర్: కూరగాయలు,చికెన్‌, తక్కువ కొవ్వు ఉన్న పనీర్
రాత్రి: ఒక గ్లాస్‌ పసుపు పాలు


Also read: Turnip For Weight Loss: టర్నిప్‌తో వెయిట్‌ లాస్‌ అవ్వడం సులభం..1 వారంలోనే మంచి ఫలితాలు!


✴  డే- 5 ప్లాన్‌:


ఉదయం: చియా సీడ్ లెమన్ వాటర్
టిఫిన్: మల్టీగ్రెయిన్ బ్రెడ్‌తో వెజిటబుల్ బేసన్ చీలా
లంచ్: చపాతీ, మిక్స్‌డ్ వెజ్ సబ్జీ, మజ్జిగ
సాయంత్రం: పండ్లు, గింజల, పెరుగు
డిన్నర్: మిల్లెట్  ఖిచ్డీతో వేయించిన పచ్చి వెజ్
రాత్రి:  ఒక గ్లాస్‌ స్కిమ్డ్ మిల్క్


✴  డే-  6 ప్లాన్‌:


ఉదయం: నానబెట్టిన ఎండుద్రాక్ష
టిఫిన్: సాంబార్,కొబ్బరి చట్నీతో మిల్లెట్ ఇడ్లీ
లంచ్: చపాతీ, సత్తు మజ్జిగ, ఎగ్ కర్రీ
సాయంత్రం: కాల్చిన మఖానా
డిన్నర్: కూరగాయలు, చికెన్ టాకో 
రాత్రి: ఒక గ్లాస్‌ స్కిమ్డ్ మిల్క్


✴  డే- 7 ప్లాన్‌:


ఉదయం: నిమ్మకాయ వాటర్‌
టిఫిన్: వెజిటబుల్ ఉప్మా
లంచ్: చపాతీ, పెరుగు, పనీర్ సలాడ్‌, చికెన్ కీమా
సాయంత్రం: వేరుశెనగ, చనా భెల్
డిన్నర్: టొమాటో సూప్‌తో బజ్రా రోటీ
రాత్రి:  పాలతో డ్రై ఫ్రూట్స్


ఈ  7-రోజుల  ప్రొటీన్ డైట్ ప్లాన్ ను తు చ తప్పకుండా పాటించడం వల్ల  సువులుగా మీరు అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందుతారు.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి