Turnip For Weight Loss: శీతాకాలంలో తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవశాలు ఉన్నాయి. చలి కాలంలో మార్కెట్‌లో ఎక్కువగా దుంపులు లభిస్తూ ఉంటాయి. వీటిల్లో ఎక్కువగా టర్నిప్ కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి రోజు ఆహారంలో భాగంగా టర్నిప్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో పోషక గుణాలు చలి కాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. టర్నిప్‌లో శరీరానికి అవసరమైన మెగ్నీషియం, ఫాస్పరస్, ఫోలేట్, కాల్షియం, విటమిన్ సి, పొటాషియం లభిస్తాయి. కాబట్టి శీతాకాలంలో వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల చాలా శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయి.
టర్నిప్ వల్ల శరీరానికి కలిగే లాభాలు:
పేగు సమస్యలకు చెక్:
టర్నిప్‌లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు శీతాకాలంలో క్రమం తప్పకుండా తీసుకుంటే పెద్ద పేగులో వాపు, ఒత్తిడి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు ఇందులో ఉండే కొన్ని మూలకాలు పొట్ట నొప్పిని దూరం చేసేందుకు కూడా సహాయపడుతుంది.
రక్తపోటును తగ్గిస్తుంది:
టర్నిప్‌లలో డైటరీ నైట్రేట్ అనే మూలకం లభిస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఆహారంలో టర్నిప్‌ను తీసుకోవడం వల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని 2013లో బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఫార్మకాలజీలో ఓ అధ్యయనం పేర్కొన్నారు. దీంతో పాటు ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీనిని చలి కాలంలో క్రమం తప్పకుండా తీసుకుంటే ధమనులకు విశ్రాంతి కలుగుతుంది.
గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది:
టర్నిప్‌లో అధిక పరిమాణంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో పాటు మధుమేహం కూడా కంట్రోల్ అవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
చలికాలంలో టర్నిప్‌ను ఆహారంలో తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. ఇందులో అధిక ఫైబర్, తక్కువ కేలరీలు లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా మలబద్ధకం ఇతర పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచేందుకు..
టర్నిప్‌లో ఐరన్ పరిమాణాలు అధిక మోతాదులో లభిస్తాయి. దీంతో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కూడా లభిస్తాయి. కాబట్టి చలి కాలంలో ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి