Blood Thinner Medicines: కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి నిరంతరం పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ నియంత్రణకై అనునిత్యం కొత్త మార్గాల అణ్వేషణ జరుగుతోంది. ఈ క్రమంలో కొత్త విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సంక్షోభం(Corona Crisis)మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎన్నో రకాల అధ్యయనాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి ప్రయోగం, ప్రతి అధ్యయనంలో కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. కోవిడ్ నియంత్రణలో, మరణాల్ని తగ్గించడంలో, సంక్రమణ వేగం తగ్గడంలో ఏ మందులు ఉపయోగపడుతున్నాయనే విషయాలు వివిధ రకాల అధ్యయనాల ద్వారా వెల్లడవుతున్న పరిస్థితి. తాజాగా లాన్సెట్ ఈ క్లినికల్ జర్నల్ ప్రచురితమైన అంశాలు ఆసక్తి కల్గిస్తున్నాయి.


కరోనా చికిత్సలో ఉపయోగించే రక్తాన్ని పలుచన చేసే మందులు అంటే బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్(Blood Thinner Medicines) కోవిడ్ మరణాల్ని అడ్డుకోవడంలో సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు తేలింది. అమెరికాలోని మిన్నెసోటా యూనివర్శిటీ, స్విట్జర్లాండ్‌లోని బాసెల్ యూనివర్శిటీ పరిశోధకులు 90 రోజులపాటు యాంటీ కో యాగ్యులేషన్ థెరపీతో వివరాలు సేకరించారు. దాదాపు 60 ఆసుపత్రుల్లో 2020 మార్చ్ 4 నుంచి ఆగస్టు 27 వరకూ 6 వేల 195 మంది రోగులపై పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో రక్తాన్ని పలుచన చేసే మందులతో కోవిడ్ మరణాలు తగ్గినట్టుగా గుర్తించారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టి..సంకట స్థితి తలెత్తుతుంది. అటువంటప్పుడు బ్లడ్ థిన్నర్‌లతో ముప్పు తొలగించుకోవచ్చు. కోవిడ్ సోకే నాటికే బ్లడ్ థిన్నర్లు ఉపయోగిస్తున్నవారిలో కరోనా ముప్పు, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలు గణనీయంగా తగ్గుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. బ్లడ్ థిన్నర్లు వినియోగిస్తున్నవారిలో 43 శాతం మంది ఆసుపత్రికి రాకుండానే కోవిడ్‌ను జయించేశారు. మరణాల రేటు కూడా సగం కంటే తక్కువగా ఉన్నట్టు తేలింది. కోవిడ్(Covid19) కారణంగా ఆసుపత్రిలో చేరినప్పుడు బ్లడ్ థిన్నర్లు ఇవ్వడం ద్వారా కరోనా తీవ్రమయ్యే అవకాశాలు చాలావరకూ తగ్గుతున్నాయి.


Also read: Dussehra Celebrations: విజయవాడ దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook