ప్రతి ఇంట్లో తప్పకుండా కన్పించే దినుసులు మెంతులు ( Fenugreek seeds ). ఏదోరూపంలో మెంతుల్ని తీసుకోవడం చాలా మంచిది. ప్రతిరోజూ ఉదయం మెంతుల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు. కానీ ముమ్మాటికీ నిజం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రస్తుత బిజీ లైఫ్ ( Busy life ) లో వెంటాడే అనారోగ్యసమస్యల్లో ( Health Disorders ) ప్రధానంగా ప్రస్తావించుకోవల్సింది మధుమేహం ( Diabetes ) ,  కొలెస్ట్రాల్ ( Cholesterol ) , జీర్ణ సమస్య( Digestion problem ) , అధిక బరువు ( Over Weight ). ఈ సమస్యల్నించి గట్టెక్కడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం..విఫలమవుతుంటాం. కానీ ఈ సమస్యల్నించి విముక్తి పొందడానికి అనాదిగా ఉన్న ఓ చిట్కా కూడా ఉంది. అదే బిజీ లైఫ్ లో పడి పాటించం గానీ...క్రమం తప్పకుండా ఆ చిట్కాను పాటిస్తే మీకున్న ఆ సమస్యలన్నీ దూరమవడం ఖాయం. 


మెంతుల్లో ( Fenugreek seeds ) కావల్సిననంత పీచు ( Fibre ) పదార్ధముంటుంది. మెంతి ఆకులో ఇనుము ( Iron ) సమృద్ధిగా లభిస్తుంది. దీంతోపాటు విటమిన్ సి, బి 1, బి 2, కాల్షియం ఉంటాయి. వంద గ్రాముల మెంతుల్ని తీసుకుని పరిశీలిస్తే...323 కేలరీల శక్తి, 58 గ్రాముల కార్బొహైడ్రేట్స్, 25 గ్రాముల తినే పీచు ( Diet Fibre ) తో పాటు మనిషికి కావల్సిన ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి 1 , బి 2, బి3, బి 6 ఇతరత్రా పుష్కలంగా లభిస్తాయి. Also read: Almonds: బాదాం...పోషకాలం గోదాం


మధుమేహం ( Diabetes )


మధుమేహాన్ని ( Diabetes ) మెంతులు అద్భుతంగా నియంత్రిస్తాయని  వైద్య పరిశోధనల్లో నిర్ధారణైంది.  పాంక్రియాస్ ను పోషించే కొవ్వు మేటల్ని మెంతులు శుభ్రపరుస్తాయి, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ లో మెంతులు అద్భత ఔషధంగా పని చేస్తాయి. మెంతుల్లో ఉండే ట్రైగోనెలిన్, కౌమారిన్ లు మధుమేహంపై పనిచేస్తాయి. ప్రతి రోజూ 50 ముల మెంతుల్ని 2-3 డోసులుగా తీసుకోవాలి. నేరుగా తీసుకున్నా సరే..లేదా నీటిలో నానబెట్టి తీసుకున్నా సరే.


కొలెస్టరాల్ ( Cholesterol ) సమస్యకు చెక్


మెంతుల్ని కొలెస్టరాల్ ( Bad Cholesterol ) తగ్గించుకోడానికి ఉపయోగించవచ్చు. కొలెస్టరాల్ తో బాధపడేవారు రోజుకు 10-20 గ్రాముల మెంతుల్ని నీళ్లతో కలిపి లేదా మజ్జిగతో తీసుకుంటే చెడు కొలెస్టరాల్ గా చెప్పుకునే లో డెన్సిటీ లిపో ప్రొటీన్ ( LDL ) కచ్చితంగా తగ్గుతుంది. Also read: Health tips: తులసి పాలు తాగితే.. ఈ రోగాలు మటుమాయం


జీర్ణశక్తి ( Digestion power )


గొంతులో పట్టే కఫం, వాతానికి వ్యతిరేకంగా మెంతులు కచ్చితంగా పనిచేస్తాయని ఇప్పటికే అందరికీ తెలుసు. అందుకే జీర్ణప్రక్రియ సరిగ్గా లేకపోవడం, గ్యాస్, పొట్ట ఉబ్బరింపుగా ఉండటమనే సమస్యలు మెంతులతో దూరమవుతాయి. నీళ్ల విరేచనాల్ని కూడా మెంతులు నియంత్రిస్తాయి. ప్రతిరోజూ ఉదయం పూట అంటే పరగడుపున రాత్రి నీళ్లలో నానబెట్టిన ఓ పది గ్రాముల మెంతుల్ని..అదే నీళ్లతో కలిపి తీసుకోవాలి.