Ajwain Leaves Health Benefits: సాధరాణంగా మన ఇంట్లో చాలా మంది వివిధ రాకాల మొక్కలను పెంచుతుంటారు. అందులో కొంతమంది  వాము ఆకులను కూడా పెంచుతుంటారు. చాలా మంది వీటిని పిచ్చి ఆకులు అనుకుంటారు. కానీ ఇందులో దివ్య ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే వాము ప్రత్యేకతలు ఏంటి? దీని ఎలా ఉపయోగించాలి? అనే విషయాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో వాము ఆకులను ఉపయోగిస్తున్నారు. వీటిని అనేక రకాల పోషకాలు దాగి ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీని అజ్వైన్‌ అని కూడా పిలుస్తారు. వామును గింజలను వంటల్లోకి ఉపయోగిస్తారు. అంతేకాకుండా వాము తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తారు. కానీ ఇది కేవలం జీర్ణవ్యస్థను మాత్రమే కాకుండా మరి కొన్ని ఆరోగ్యలాభాలను కూడా అందిస్తుంది. 


వాము ఆకులు తినడం వల్ల గ్యాస్‌, అజీర్ణం, అల్సర్‌ వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా బరువు తగ్గాలనుకొనేవారు వాము ఆకులు తినడం వల్ల జీవక్రియ రేటును పెంచుతుంది. అలాగే కొవ్వు కరిగించడంలో ఎంతో సహాయపడుతుంది. దీని వల్ల సులువు బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. అలాగే శ్వాసకోశాన్ని శుభ్రపరచడంలో కూడా వాము ఆకులు ఎంతో మేలు చేస్తాయి. తరుచు గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు వాము ఆకులు తీసుకోవడం చాలా మంచిది. 


చర్మ సమస్యలతో బాధపడేవారు కూడా వాము ఆకులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. వాము ఆకులను నూనెలో కలుపుకొని తలకు మర్ధన చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారికి వాము ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఇది షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రిచడంలో సహాయపడుతాయి. 



వాము ఆకులను ఎలా ఉపయోగించాలి:


వాము ఆకులను ప్రతిరోజు ఉదయం నమిలి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.దీని వల్ల అల్సర్‌, గ్యాస్‌ వంటి సమస్యలు త్వరగా తొలగుతాయి. కొంతమంది వాము ఆకులతో చాయ్‌ ను తయారు చేసుకొని తాగుతారు. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా సహాయపడుతుంది. వాము ఆకులను సలాడ్‌లో కలిపి తినడం వల్ల ఆహారం ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన విటమిన్‌లు, మినర్సల్‌ లభిస్తాయి. 


 మాంసం వంటలలో వాము ఆకులను వేయడం వల్ల మాంసం మృదువుగా మారుతుంది. ఇది మాంసంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్‌ శరీరంలోకి చేరకుండా ఉంటుంది. ఆహారంలో మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటిని దంచి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం పై మచ్చలు, మొటిమలు కలగకుండా ఉంటాయి. 
Also Read: Diabetes: డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే ఈ ఆసనాలు ట్రై చేయాల్సిందే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.