Yoga Asanas For Diabetes: భారతదేశంలో యోగాకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతిరోజు యోగాన్ని అనుసరించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇది మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. యోగా అనేది అనేక రకాలుగా ఉంటాయి. అయితే యోగా అనేది కేవలం మనస్సుకు మాత్రమే కాకుండా ఇది వ్యాధులను కూడా తగ్గించడానికి ఉపయోగపడతుంది. ముఖ్యంగా థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలను కూడా యోగా చేస్తూ తగ్గించుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెప్తున్నారు. ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని అదుపు చేసుకోవడానికి వారు పడుతున్న పాటలు చెప్పుకోలేనివి. డయాబెటిస్ ఉన్నవారు ఇన్సులిన్లను తప్పించుకోవడానికి దీని ఆహారాలను మందులను ఉపయోగిస్తుంటారు. కానీ సహజంగా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడంలో యోగా ఎంతో సహాయపడుతుంది. అయితే ఏ ఆసనాలు చేయాలి ఎంత సమయం వరకు చేయాలి అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం.
భుజంగాసనం:
భుజంగాసనం డయాబెటిస్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. దీని భుజంగాసనం, లేదా సర్పాసనం అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం ఒక సర్పం తన తలను పైకి లేపినట్లుగా ఉంటుంది. ఈ ఆసనం వెన్నుముక, చేతులను దృఢంగా మార్చుతుంది. ఈ ఆసనం శరీరానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ఆసనాని 30 సెకన్ల పాటు చేయండి.
మకరాసనం:
మకరాసనం అనే యోగాసనం చేయడం వల్ల శరీరంలోని అనేక భాగాలకు మేలు కలుగుతుంది. ఇది మొసలి భంగిమలా ఉంటుంది. అందుకే దీని మకరాసనం అని పిలుస్తారు. ముందుగా నేలపైన సాఫుగా పడుకోవాలి. ఆ తరువాత కడుపుపై పడుకుని ఛాతీ, తలను చేతుల కింద పెట్టుకోవాలి. ఇలా 30 సెకన్ల ఉండటం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
అర్ధ మత్స్యాసనం:
ఈ ఆసనం చేయడం వల్ల శరీరం దృఢంగా తయారు అవుతుంది. షుగర్ లెవెల్స్‌ను కొంట్రోల్ చేయడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు వీపు, మొండెం, శరీరానికి ఒక వైపు తిప్పాలి. చేతులు, మోకాళ్లపైన పెట్టుకోవాలి. ఇలా 30 సెకన్ల చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
మండూకాసనం:
కప్ప భంగిమను మండూకాసన అని పిలుస్తారు. ఇది చేయడానికి ఛాతీ, భుజాలను సరిగ్గా వంచాలి. ఆ తరువాత కాళ్లను మడిచి పాదాలను కలుపుకోవాలి. ఇలా 30 సెకన్ల పాటు ఉండటం వల్ల మంచి ఫలితాలతో పాటు డయాబెటిస్ ఉన్నారు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
ఈ విధంగా ప్రతిరోజు ఉదయం ఈ ఆసనాలు చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటుంది. కాబట్టి మీరు ప్రత్నయం చేయండి. దీని చేసే ముందు యోగా వైద్యుడి సహాయాం, సూచన తీసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: Oily Skin: ఎలాంటి ఖర్చు లేకుండా జిడ్డు చర్మాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Diabetes: డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే ఈ ఆసనాలు ట్రై చేయాల్సిందే..!