Almond Oil Benefits: మారుతున్న కాలం ప్రకారం మనలో చాలా మంది ముఖం కాంతివంతం మారేందుకు ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. కానీ వీటన్నింటిని ఓ నూనెతో మాత్రం తయారు చేయగలరు. పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాసుకోవాలి. దాని వల్ల ముఖం మెరుగ్గా కనిపిస్తుంది. అయితే బాదం నూనె ప్రయోజనాలు.. దాని వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాదం నూనెలోని పోషకాలు..


బాదం నూనె చాలా పోషకాలను కలిగి ఉంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి, పొటాషియం, ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్పరస్, మాంగనీస్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ పోషక కారకాలు చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని తెలుస్తోంది.


బాదం నూనెను ముఖానికి ఎలా అప్లై చేయాలి


బాదం నూనెను ముఖానికి రాసుకోవడానికి రెండు మార్గాలున్నాయి. మొదటి మార్గం ఏమిటంటే.. పడుకునే ముందు నేరుగా మీ ముఖానికి బాదం నూనె కొన్ని చుక్కలుగా అప్లే చేసుకోని ఉదయాన్నే నీటితో ముఖం కడుక్కోవాలి. మరొక పద్ధతి ఏమిటంటే.. పడుకునే ముందు, బాదం నూనె కొన్ని చుక్కలను తీసుకొని అరచేతుల మధ్య రుద్దాలి. అలా చేయడం వల్ల అరచేతులు కొద్దిగా వేడెక్కుతాయి. దీని తర్వాత అరచేతులతో ముఖాన్ని మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. 


ముఖానికి బాదం నూనె వల్ల కలిగే ప్రయోజనాలు:


- బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ.. చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ను దూరం చేస్తుంది.


- బాదం నూనె ముడుతలను తొలగించడంలో సహాయపడుతుంది.


- బాదం నూనెను మీ చర్మానికి అప్లై చేయడం వల్ల తేమను లాక్ చేసి.. రోజంతా మీ చర్మం మెరుస్తూ ఉంటుంది.


- బాదం నూనెను ముఖానికి అప్లై చేయడం వల్ల దురదతో సహా చర్మం చికాకు తగ్గుతుంది.


- మొటిమల సమస్యలను పరిష్కరిస్తుంది.


- బాదం నూనె మీ చర్మం కొద్దిగా నిస్తేజంగా లేదా అలసిపోయినప్పుడు ఉపశమనం కోసం బాదం నూనెను ఉపయోగించవచ్చు.


- ఇది మీ చర్మపు రంగును రక్షిస్తుంది. 


- బాదం నూనె చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక గొప్ప మార్గం.


- మీ చర్మాన్ని ఎండ నుంచి రక్షించేందుకు బాదం నూనె సహకరిస్తుంది.


అయితే, మీకు ఏదైనా అలెర్జీ సమస్య ఉంటే లేదా బాదం నూనె మీ చర్మానికి ప్రతికూల భావాలను కలుగుజేస్తే.. బాదం నూనెను ఉపయోగించకపోవడమే మంచిది. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


Also Read: Turmeric for Diabetes: ఆహరంలో పసుపు వినియోగంతో డయాబెటిస్ కు చెక్!


Also Read: Fenugreek Seeds Benefits: పురుషుల్లో సంతానప్రాప్తిని పెంచే దివ్యఔషధం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook