Turmeric for Diabetes: ఆహరంలో పసుపు వినియోగంతో డయాబెటిస్ కు చెక్!

Turmeric for Diabetes: ప్రతి ఇంట్లోని వంట గదిలో దొరికే పసుపు వల్ల చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. పసుపు వినియోగంతో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 12:00 PM IST
Turmeric for Diabetes: ఆహరంలో పసుపు వినియోగంతో డయాబెటిస్ కు చెక్!

Turmeric for Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు మార్కెట్‌లో చాలా మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, కొందరు ఆయుర్వేద పద్ధతిలో ఇంటి చిట్కాలను వినియోగిస్తుంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడొక చిట్కా తీసుకొచ్చారు. మీ వంటగదిలో సులభంగా అందుబాటులో ఉండే పసుపు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా రక్తంలోని షుగర్ స్థాయిని కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ..

పసుపు మీ గాయాలను నయం చేయడానికి మాత్రమే కాదు.. మధుమేహ రోగులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పసుపులో షుగర్ స్థాయిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర సులభంగా నియంత్రించవచ్చు. కాబట్టి మీరు దీన్ని మీ ఆహారంలో కూడా చేర్చుకోవచ్చు.

పసుపును ఇలా ఉపయోగించండి!

షుగర్ వ్యాధిగ్రస్తులు.. తమ తమ వైద్యుడిని సంప్రదించకుండా పసుపును ఉపయోగించరాదు. దీన్ని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. అన్నింటిలో మొదటిది, మీరు దీన్ని ఏదైనా కూరగాయలలో లేదా ఆహారంలో చేర్చవచ్చు. అంతే కాకుండా పసుపు నీళ్లు తాగొచ్చు. లేదంటే పసుపుతో తయారు చేసే టీ తాగడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  

Also Read: Curd Benefits: ఇంటీ నుంచి బయటకు వెళ్లే సమయంలో చక్కెర కలిపిన పెరుగును తినండి..!!

Also Read: Fenugreek Seeds Benefits: పురుషుల్లో సంతానప్రాప్తిని పెంచే దివ్యఔషధం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News