Almonds Nutrition Benefits: డ్రై  ఫ్రూట్స్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి ఏంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే డ్రై ఫ్రూట్స్‌లో   బాదం పప్పు ఒకటి. బాదం పప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ బాదం పప్పు తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను అదుపు ఉంచుతుంది.  అంతేకాకుండా వీటిలో అనేక రకాల పోషకాలు దాగి ఉన్నాయి. అయితే బాదం పప్పు తీసుకోవడం వల్ల కలిగే మరి కొన్ని ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 బాదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా  లభిస్తాయి.  


 చెడు  కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో బాదం  ఎంతో సహాయపడుతుంది.


●​ బాదం బ్లడ్‌ షుగర్‌ను నియంత్రించడంతో ఎంతో ఉపయోగపడుతుంది.


●​ గుండె జబలుబారిన పడకుండా ఉండాలి అంటే ప్రతిరోజు బాదం గింజలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.


●​ అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు ఈ బాదం గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


●​ బరువు సమస్యలతో  బాధపడుతున్నవారు బాదం పప్పలు తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.


●​ బాదం కంటికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


●​ బాదం పప్పులో అధిక శాతం విటమిన్‌ ఇ లభిస్తుంది. విటమిన్‌ ఇ లోపం ఉన్నవారు ఈ బాదం పప్పు తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.


Also read: Walking Tips: వాకింగ్ ఎప్పుడు చేస్తే మంచిది, ఉదయమా.. సాయంత్రమా


●​ బాదం పప్పును ప్రతిరోజు తీసుకోవడం వల్ల చర్మ  కణాలకు సరిపోయే పోషకాలు అందుతాయి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.


 అంతేకాకుండా బాదం ప‌ప్పు పొట్టు తీసి తిన‌డం వ‌ల్ల  జీర్ణ‌ క్రియ మెరుగుపడుతుంది.


 బాదం పప్పు మెదడు పనితీరు మెరుగుపరచడంలో మేలు చేస్తుంది.  దీని వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.


●​ ఎముకలు దృఢంగా ఉంచడంలో బాదం ఎంతో మేలు చేస్తుంది. 


●​ డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌ చేయడంలో  బాదం పప్పు ఉపయోగపడుతుంది.


 బాదం పప్పు ప్రతిరోజు తీసుకోవడం వల్ల  క్యా‌న్సర్, ప్రొస్టేట్ క్యా‌న్సర్ ఇతర సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.


ఈ విధంగా బాదం పప్పును తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా ప్రతిరోజు దీని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  


Also read: Pomegranate Benefits: రోజూ పరగడుపున దానిమ్మ తింటే ఇన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook