Dark Circles: ఆధునిక బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా కంటి కింద నల్లటి వలయాలు ప్రధాన సమస్యగా మారింది. కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉంటే ముఖం అంద విహీనంగా మారిపోతుంది. కొన్ని సులభమైన పద్ధతులతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవిలో అయినా లేదా బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఎండల్లో తిరగడం, వేడి గాలులు, నేరుగా సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అవడంతో స్కిన్ ట్యానింగ్, డార్క్ సర్కిల్స్ సమస్యలు వెంటాడుతుంటాయి. కంటి కింద బ్లాక్ సర్కిల్స్ వల్ల ముఖం అంద విహీనంగా మారిపోతుంటుంది. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేదెలా. ఒకే ఒక వస్తువు సహాయంతో సులభంగా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.


అల్లోవెరాతో బ్లాక్ సర్కిల్స్ దూరం


అల్లోవెరాలో ఉండే ఔషధ గుణాలు అత్యధికం. అల్లోవెరా ఔషధ గుణాల గురించి అందరికీ తెలుసు. ఇది చర్మ సంరక్షణకు చాలా మంచిది. అందుకే చాలా రకాల బ్యూటీ ఉత్పత్తుల్లో అల్లోవెరా తప్పకుండా వినియోగిస్తారు. అల్లోవెరా సహాయంతో కంటి కింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాత్రి నిద్రపోయే ముందు కంటి చుట్టూ..అల్లోవెరా జెల్ రాసి మస్సాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం మృదువుగా మారుతుంది. గ్లో వస్తుంది. క్రమం తప్పకుండా వాడితే కంటి కింద బ్లాక్ సర్కిల్స్ దూరమౌతాయి.


డార్క్ సర్కిల్స్ దూరం చేసేందుకు అల్లోవెరా జెల్‌తో ఫేస్‌మాస్క్ తయారు చేసుకోవాలి. అల్లోవెరాలో విటమిన్ సి, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. దీంతో చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి చేసే కణాల సంఖ్య పెరుగుతుంది. అల్లోవెరాతో ఫేస్‌మాస్క్ తయారు చేయాలంటే..ముందుగా తేనె, అల్లోవెరా జెల్ మిక్స్ చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం రోజ్ వాటర్ కాస్త కలుపుకోవాలి. దాదాపు 15 నిమిషాలసేపు ముఖంపై రాసి..ఆరిపోనివ్వాలి. తరువాత గురువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే..కంటి కింద బ్లాక్ సర్కిల్స్ పోతాయి.


Also read: Broccoli Juice Benefits: మెదడు చురుగ్గా పని చేయాలంటే.. ఈ జ్యూస్ తాగండి! ఇంకా ఆలస్యం ఎందుకు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.