Jonna Ambali benefits: సాధారణంగా జొన్నలతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుంటాం. ఈ జొన్నల్లో అనేక పోషకాలు శరీరానికి లభిస్తాయి. జొన్న‌ల్లో క్యాల్షియం, ఐర‌న్, ఫాస్ఫ‌ర‌స్ వంటి వంటి గుణాలు అధికంగా లభిస్తాయి.  జొన్నలతో రొట్టెలను కూడా తయారు చేసుకోవచ్చు. అయితే జొన్న అంబలిని తీసుకోవడం ఎంతో మంచిది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జొన్న అంబ‌లిని ఎలా త‌యారు చేసుకోవాలి:


ముందుగా ఒక గిన్నెలో ఒక క‌ప్పు జొన్న పిండిని తీసుకోవాలి. ఇందులోకి మూడు గ్లాసుల నీళ్లు పోసి, ఉప్పు వేసి క‌లుపుకోవాలి.  త‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి పిండిని క‌లుపుతూ ఉడికించాలి. ఈ అంబ‌లిని పది నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత  మిరియాల పొడి, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న అంబ‌లి త‌యార‌వుతుంది.


ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృడంగా తయార‌వుతాయి. రక్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది.  బ‌రువు తగ్గాల‌నుకునే ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను పొందవచ్చు. 


అంతేకాకుండా ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల కండ‌రాలు ధృడంగా త‌యార‌వుతాయి. ప్ర‌తిరోజూ జొన్న అంబలిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం పొందుతారు. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి త‌గ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా మలబద్దం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. 


Also Read: Memory Improving Tips: మతిమరుపు పెరుగుతోందా.. అయితే ఇవి ఫాలో అవ్వడం చాలా ముఖ్యం..


ఈ జొన్న అంబలిని తీసుకోవడం వల్ల అలసట, బలహీనత  వంటి సమస్యలు తగ్గుతాయి.  చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి  గుండె ఆరోగ్యంగా ఉంచడంలో ఈ జొన్న అంబలి ఎంతో మేలు చేస్తుంది.  జొన్న‌ల‌తో చేసిన అంబ‌లి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.


దీనిని పిల్ల‌ల , పెద్దలు ఆహారంగా తీసుకోవ‌చ్చు. జొన్న‌ల‌తో రొట్టెలే కాకుండా ఇలా అంబ‌లిని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also Read: Moong Dal Soup: దగ్గు, జ్వరానికి పెసర పప్పు సూప్‌.. దీంతో కలిగే ప్రయోజనాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter