Weight Loss With Ragi: రాగుల్లో ఫైబర్ అత్యధికంగా ఉండటం వల్ల దీంతో బరువు సులభంగా తగ్గిపోవచ్చు. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే కడుపు ఎక్కువసేపు నిండిన అనుభూతి కనిపిస్తుంది. దీంతో అతిగా తినం బరువు నిర్వహణ కూడా సక్రమంగా సాగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్..
ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇతర ఆహారపదార్థాలతో పోలిస్తే రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. జీఐ తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రాగులను మీ డైట్లో చేర్చుకుంటే బరువు కూడా తగ్గుతారు.


జీర్ణ ఆరోగ్యం..
రాగుల్లో ఉండే ఫైబర్ వల్ల బరువు తగ్గడమే కాదు జీర్ణ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పేగు ఆరోగ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తుంది.  మలబద్ధకం సమస్య రాకుండా నివారిస్తుంది. పోషకాలు గ్రహించాలంటే ఆరోగ్యకరమైన జీర్ణక్రియ ఎంతో అవసరం. అందుకే రాగులను మీ డైట్లో ఈరోజు నుంచే చేర్చుకోండి.అయితే మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తే పోషకాలు అతిగా ఉండే రాగి సంబంధిత ఫుడ్స్ మాత్రమే అధికంగా తీసుకుంటే కేలరీలు అధికం అవుతాయి. దీంతో వెయిల్ లాస్ అవ్వడం కష్టతరం అవుతుంది.


సమతుల్య ఆహారం..
మన జీవనశైలిలో సమతుల్య ఆహారం చేర్చుకోవడం ఎంతో అవసరం. దీంతో బరువు తగ్గడమేకాదు, ఆరోగ్యం కూడా. ముఖ్యంగా ఆల్ రౌండ్‌ డైట్ ఉండేలా చూసుకోవాలి.


ఇదీ చదవండి: ఈ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లుకు దూరంగా ఉండాలి..!


ఫిజికల్ యాక్టివిటీ..
మీ డైటరీ మార్పులతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎంతో ముఖ్యం. బరువు తగ్గాలనుకుంటే పోషకాలు ఉండే ఆహారంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. దీంతో మంచి ఫలితాలను పొందుతారు.ముఖ్యంగా  మీ ఆహారంలో రాగులను చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఒత్తిడి లేకుండా ఉంచడం, మైగ్రేన్ నుండి మిమ్మల్ని రక్షించడం, మధుమేహాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. 


ఇదీ చదవండి: అల్లం టీతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు.. ఆడవారికి కూడా దివ్యౌషధం..


ఇలా తీసుకోండి..
రాగులతో రకరకాల ఆహారాలను తయారుచేసుకోవచ్చు. రాగి అంబలి, రాగి దోశ, రాగిరొట్టె వంటివి తీసుకోవచ్చు. ఇందులో నచ్చిన విధంగా వండుకోవచ్చు. ముఖ్యంగా రాగి ముద్ద కూడా తయారు చేసుకోవచ్చు.అయితే, మీకు ఇది వరకే మలబద్ధకం సమస్య ఉంటే రాగులను తీసుకోవద్దు. అంతేకాదు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా రాగులను డైట్లో చేర్చుకోవద్దు. వీళ్లు ప్రత్యేకంగా వైద్యులు సూచించిన ఆహారాన్నాఏ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు థైరాయిడ్ ఉన్నవారు కూడా రాగులను వారి డైట్లో చేర్చకూడదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook