Ginger Tea Benefits: అల్లం టీతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు.. ఆడవారికి కూడా దివ్యౌషధం..

Ginger Tea Health Benefits: ప్రతిరోజూ ఉదయం టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే కొందరు కేవలం ఉదయం అనే కాకుండా రోజులో చాలాసార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, మామూలు టీ తాగడం కంటే అల్లం టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 16, 2024, 08:52 AM IST
Ginger Tea Benefits: అల్లం టీతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు.. ఆడవారికి కూడా దివ్యౌషధం..

Ginger Tea Health Benefits: ప్రతిరోజూ ఉదయం టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే కొందరు కేవలం ఉదయం అనే కాకుండా రోజులో చాలాసార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, మామూలు టీ తాగడం కంటే అల్లం టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అల్లంలో విటమిన్ సి మెగ్నీషియం ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటి అనేది తెలుసుకుందాం. అల్లం టీ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఆహారం అధిక మోతాదులో తిన్నప్పుడు అది అరగడానికి కొందరు చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఆహారం తిన్న తర్వాత కప్పు అల్లం టీ తాగితే అది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడమే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అల్లంలో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణ మెరుగుపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి 

అల్లం టీ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. అంతేకాకుండా రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గించే గుండెపోటు అనేది రాకుండా చేస్తుంది. ఆడవారిలో నెలసరి ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.  సకాలంలో నెలసరి రాకపోవడం వల్ల ఆడవారు ఇబ్బందిపడుతుంటారు. అలాంటి ఇబ్బంది ఉన్నవారు వేడి వేడి అల్లం టీ, తేనె కలిపిన ఒక కప్పు టీని కూడా నెలసరి సమయం తీసుకుంటే మంచిదే. శ్వాస సంబంధిత సమస్యల నుండి కాపాడుతుంది. చలికాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య ముక్కు దిబ్బడ శ్వాస సరిగా పీల్చుకోలేకపోవడం అల్లం టీతో అలాంటి వాటికి చెక్ పెట్టొచ్చు. జలుబు చేసినా ముక్కు దిబ్బడగా ఉన్న ఒకప్పు అలాంటి తాగితే ఉపశమనం ఉంటుంది. వికారం తగ్గుతుంది.

ఇదీ చదవండి:  కిడ్నీ వ్యాధులు ఉత్తరాదివారిలోనే ఎక్కువగా ఉంటున్నాయా, కారణమేంటి

చాలా మందికి ఉదయాన్నే వేడివేడిగా టీ గొంతులో పడితే కానీ మనసు ఊరుకోదు. ఉత్సాహంగా కూడా పనిచేస్తారు టీకి అల్లం జోడిస్తే ఆరోగ్యానికి మంచిది కూడా. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి మెగ్నీషియం, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రయాణాల్లో కడుపు తిప్పే వారికి వాంతులు అయ్యే వారికి అలాంటిస్తే ఉపశమనం కలుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ తేన్పులు, జీర్ణ సమస్యతో బాధపడేవారికి కూడా అల్లంటీ చాలా మంచిది. 40 ఏళ్లు దాటిన వ్యక్తులకు నడుంనొప్పి, కీళ్లనొప్పులు వస్తుంటాయి. అలాంటి వారు కూడా అలాంటి తాగొచ్చు.

ఇదీ చదవండి:  సమ్మర్ లో టీ అతిగా తాగుతున్నారా..?.. ఈ డెంజర్ లో పడ్డట్లే..

జలుబు, జ్వరం ఉన్నవారు అల్లం టీ తాగాలి, మెరుగైన రక్తప్రసరణకు అల్లం టీ బాగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు అలాంటితో చెక్ పెట్టవచ్చు. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి సమస్యలకు అల్లంటీ బెస్ట్‌.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News